లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ “చిత్రలేఖ” ప్రారంభం
హరిప్రియ స్టూడియోస్ బ్యానర్ పై వి.సి.రావు సమర్పణలో కృష్ణ వంశీ నిర్మిస్తున్న చిత్రం చిత్రలేఖ. ఈ చిత్రానికి తెలంగాణ దేవుడు చిత్ర దర్శకుడు హరీష్వడత్యా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం “బేబీ హరి ప్రియ” పూజా కార్యక్రమాలతో నేడు సారధి స్టూడియోస్‌లో ప్రారంభమైంది. దర్శకుడు తులసీరామ్ క్లాప్ కొట్టి ప్రారంభించగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్చంద్రు తేజవత్ మరియు టీ ఎస్ డబ్లుయు సి ఛైర్మెన్ సాయి చంద్ లు కెమెరా స్వచాన్ చేశారు. చిత్ర దర్శకుడుహరీష్ వడత్యా, డి.ఎస్‌రావ్ హీరో హీరోయిన్ల పై గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో…
చిత్ర దర్శకుడు హరీష్ వడత్యా మాట్లాడుతూ… ఇది నా రెండవ చిత్రం. ఈచిత్రం పై ఆరు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసి మొదలు పెట్టాము. ఇదొక మంచి లవ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించబోతున్నాము అన్నారు. ఇందులో ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుభాష్, శ్రీహర్ష ఇద్దరూ చాలా బాగా నటించారు. ఇందులో పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. మొత్తం రెండు ష్యెడ్యూలలో పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాము. మూవీ మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు అన్నారు.
హీరో సుభాష్ మాట్లాడుతూ… ఇందులో నేను చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. నాతో చాలా మంచి క్యారెక్టర్ చేయించాలని మా డైరెక్టర్ అనుకుంటున్నారు. నాలో ఉన్న ట్యాలెంట్ అంతా ఉపయోగించి నన్ను బాగా షార్ప్ చేస్తారని కోరుకుంటున్నాను.
మరో హీరో హర్ష మాట్లాడుతూ… ఓటీటీలో ఎంతో అద్భుతమైన కంటెంట్ వస్తున్నప్పుడు ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడం చాలా కష్టమైన పనే అని చెప్పాలి. ఎంతో అద్భుతంగా కంటెంట్ ఉంటే తప్పించి ప్రేక్షకుడు రాడు. ఈ కంటెంట్‌లో ఆ దమ్ము, ధైర్యం ఉందని నమ్ముతున్నాను. తెలంగాణ దేవుడు చిత్రంతో ఆల్రెడీ తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు హరీష్‌గారికి ఈ చిత్రం కూడా మంచి విజయాన్నివ్వాలని కోరుకుంటున్నాను. దర్శకుల టీమ్ నుంచి ఆయనకు మంచి మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నాది చాలా మంచి క్యారెక్టర్ ఇదొక అవుట్ అండ్ అవుడ్ థ్రిల్లర్. ఈ సినిమా మంచి విజయం సాధించి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ హిడెన్ రోజ్ మాట్లాడుతూ… ఇదొక ప్రేమకథా చిత్రం. ఇద్దరి ప్రధాన పాత్రల మధ్య నా కథ నడుస్తుంది. నా భర్త ఒక పోలీస్ ఆఫీసర్ మరొకరు విలన్‌గా ఈ చిత్ర కథాంశం తెరకెక్కబోతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సాయి చంద్ మాట్లాడుతూ… సుపరిచిత నాయకుడిగా పరిచయమై కేసీఆర్ బయోపిక్‌ని తీసిన హరీష్‌గారు ఈ చిత్రంలో నాకు ఒక పాత్రని ఇచ్చారు. అన్నీ బాగా రావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్, హర్ష, ఇడెన్రోస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతః కృష్ణవంశీ, దర్శకుడుః హరీష్ వడత్యా కెమెరాః అడుసుమిల్లి విజయ్‌కుమార్, మ్యూజిక్ః బొబ్బిలిరాజా. ఎడిటర్: మాలిక్ జే పి, ఆర్ట్: బి. సురేష్, ఎగిక్యూటివ్ ప్రొడ్యూసర్: లింగం.కె,పి. ఆర్. ఓ: బి. వీరబాబు