..లింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన డైరెక్టర్ పన్నా రాయల్ ఇప్పుడు నిర్మాతగా మారి ‘ప్లాంట్ మ్యాన్’ అనే ఒక విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్‌లుక్‌తోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ పన్నా రాయల్.. డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ సంస్థను స్థాపించి కొత్తవారిని ప్రోత్సహించాలని, కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ‘ప్లాంట్ మ్యాన్’ అనే సినిమాను నిర్మిస్తూ కె.సంతోష్‌బాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని ఓ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘కన్నమ్మ.. చిట్టి గుండెలోన దాచలేని గోలమ్మ… ఈ పిల్లగాడి అల్లరేంటొ సూడమ్మ.. లవ్ సెయ్యమంటే ఎందుకంత బెట్టమ్మా… చెప్పమ్మా’ అంటూ ఈశ్వర్ హేమకాంత్ రాసిన పాటను రోహిత్ శ్రీనివాసన్, బి.వి.కె. వాగ్దేవి అద్భుతంగా ఆలపించారు. ఆనంద బాలాజీ ఈ పాటను స్వర పరిచారు.
ఇప్పటివరకు ఎన్నో రకాల కామెడీ సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ‘ప్లాంట్ మ్యాన్’ అనేది ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్. సైంటిఫిక్ కామెడీ ఎక్స్‌పెరిమెంట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో ఆకట్టుకునేందుకు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి నిర్మాత పవన్‌కుమార్ మాద్యాల మాట్లాడుతూ ‘‘కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. పిల్లలు, పెద్దవారు ఈ సినిమాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమా ద్వారా సంతోష్బాబుని డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాం. ఇకపై కూడా మా డిఎం యూనివర్సల్ స్టూడియోస్ బేనర్లో కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తాం’’ అన్నారు.
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్, లక్ష్మీకిరణ్, శేఖర్, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: వినోద్ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, ఎడిటింగ్: ఎస్.కె.చలం, మాటలు: సాయికృష్ణ వెలిశెట్టి, పన్నారాయల్, పాటలు: ఈశ్వర్ హేమకాంత్, సింగర్స్: వాగ్దేవి, రోహిత్ శ్రీనివాసన్, నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్, దర్శకత్వం: కె.సంతోష్‌బాబు.‘కన్నమ్మ.. చిట్టి గుండెలోన దాచలేని గోలమ్మ..’
లిరికల్ వీడియోను రిలీజ్ చేసిన ‘ప్లాంట్ మ్యాన్’ చిత్ర యూనిట్
ాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన డైరెక్టర్ పన్నా రాయల్ ఇప్పుడు నిర్మాతగా మారి ‘ప్లాంట్ మ్యాన్’ అనే ఒక విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్‌లుక్‌తోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ పన్నా రాయల్.. డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ సంస్థను స్థాపించి కొత్తవారిని ప్రోత్సహించాలని, కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ‘ప్లాంట్ మ్యాన్’ అనే సినిమాను నిర్మిస్తూ కె.సంతోష్‌బాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని ఓ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘కన్నమ్మ.. చిట్టి గుండెలోన దాచలేని గోలమ్మ… ఈ పిల్లగాడి అల్లరేంటొ సూడమ్మ.. లవ్ సెయ్యమంటే ఎందుకంత బెట్టమ్మా… చెప్పమ్మా’ అంటూ ఈశ్వర్ హేమకాంత్ రాసిన పాటను రోహిత్ శ్రీనివాసన్, బి.వి.కె. వాగ్దేవి అద్భుతంగా ఆలపించారు. ఆనంద బాలాజీ ఈ పాటను స్వర పరిచారు.
ఇప్పటివరకు ఎన్నో రకాల కామెడీ సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ‘ప్లాంట్ మ్యాన్’ అనేది ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్. సైంటిఫిక్ కామెడీ ఎక్స్‌పెరిమెంట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో ఆకట్టుకునేందుకు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి నిర్మాత పవన్‌కుమార్ మాద్యాల మాట్లాడుతూ ‘‘కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. పిల్లలు, పెద్దవారు ఈ సినిమాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమా ద్వారా సంతోష్బాబుని డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాం. ఇకపై కూడా మా డిఎం యూనివర్సల్ స్టూడియోస్ బేనర్లో కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తాం’’ అన్నారు.
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్, లక్ష్మీకిరణ్, శేఖర్, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: వినోద్ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, ఎడిటింగ్: ఎస్.కె.చలం, మాటలు: సాయికృష్ణ వెలిశెట్టి, పన్నారాయల్, పాటలు: ఈశ్వర్ హేమకాంత్, సింగర్స్: వాగ్దేవి, రోహిత్ శ్రీనివాసన్, నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్, దర్శకత్వం: కె.సంతోష్‌బాబు.