Friday, November 1, 2024

అన్వేషి… ఓ రొమాటిక్ క్రైం థ్రిల్లర్

నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకుడు : వీజే ఖన్నా
నిర్మాత: గణపతి రెడ్డి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్రఫీ: కెకె రావు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ : నవంబర్ 17, 2023
రేటింగ్ : 3/5
సస్సెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. సరైన కథ, స్క్రీన్ ప్లేతో సినిమాను వెండితెరపై ఆవిష్కరించగలిగితే… ప్రేక్షకులు ఆదరిస్తారు. కొత్త దర్శకులు ఇలాంటి జోనర్స్ ను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతున్నారు. గతంలో ఇలాంటి జోనర్స్ హిట్ ఫార్ములా. నేటికీ ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ‘అన్వేషి’ అనే చిత్రాన్ని దర్శకుడు వీజే ఖన్నా తెరకెక్కించారు. గ్లామర్ క్వీన్ అనన్య నాగళ్ల ఇందులో కీలక పాత్రలో నటించగా… విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా జంటగా నటించు. హారర్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: విక్రమ్(విజయ్ ధరణ్ దాట్ల) అను(సిమ్రాన్ గుప్త) అనే అమ్మాయిని తొలి చూపులోనే ఇష్టపడి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందడం కోసం మారేడు కోన గ్రామానికి అనుని వెతుక్కుంటూ వెళతాడు. అక్కడ వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలన్నీ షార్ట్ సర్క్యూట్ లో కాలిపోయిన హాస్పిటల్ లో ఉన్న అను అనే అమ్మాయి ఆత్మే చేస్తోందని గ్రామస్తులు నమ్ముతుంటారు. అయితే ఈ వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలనుకుంటాడు హీరో విక్రమ్. మరి విక్రమ్ ఈ వరుస మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని ఎలా ఛేదించారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: వరుస మర్డర్ల మిస్టరీ వెనుక ఎవరున్నారు అనే దానిని వెండితెరపై ఎంతో ఆస్తకిగా ఆవిష్కరించగలిగితే ఆ సినిమాలన్నీ ఎంతో థ్రిల్ కి గురి చేస్తాయి. వాటికి కొంచెం డ్రామా జోడించి సినిమాని తీస్తే… ఆడియన్స్ ఎంతో థ్రిల్ కు గురి అవుతారు. తాజాగా తీసిన అన్వేషి చిత్రం కూడా ఆద్యంతం సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ డ్రామాగా అలరిస్తుంది. ఈ చిత్రంలో కాస్త రొమాన్స్ కూడా వుండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన విజ‌య్ ధ‌ర‌ణ్‌ ఓ వైపు ప్రేమికుడిగా… మరోవైపు ఆ గ్రామంలో వరుస హత్యలకు కారణమైన మిస్టరీని చేధించే బాధ్యతగల యువకుని పాత్రలో చాలా చక్కగా నటించారు. అతనికి జోడీగా నటించిన సిమ్రాన్ గుప్తా పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. గ్లామర్ గాళ్ అన‌న్య నాగ‌ళ్ల వైద్యురాలి పాత్రలో ఒదిగిపోయింది. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగడంతో… ఆమె పాత్రను చాలా ఆకర్షణీయంగా తెరమీద చూపించారు. అలాగే ఆమెను ప్రేమించే భగ్న ప్రేమికుని పాత్రలో క్లైమాక్స్ లో కనిపించే నటుడు కూడా ఆకట్టుకున్నాడు. నటుడు అజయ్ ఘోష్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. రచ్చ రవి, దిల్ రమేష్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… దర్శకుడు ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను అనేక మలుపులతో ఆడియన్స్ ని కుర్చీలో కూర్చునేలా కట్టిపడేశారు. ఎక్కడా డీవియేట్ కాకుండా సినిమా ఆద్యంత ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దారు. అయితే నిడివిని ఇంకాస్త తగ్గించి… ట్రిమ్ చేసుంటే మరింత గ్రిప్పింగ్ గా ఉండేది ఎడిటింగ్ వర్క్. అలాగే పాటలను కూడా యూత్ కి… మాస్ కి కనెక్ట్ అయ్యేలా తీయాల్సింది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేషాన్ని సినిమాటోగ్రాఫర్ రిచ్ గా తీసారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాత గణపతి రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా సినిమాను తీశారు. గో అండ్ వాచ్ ఇట్.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x