చక్కటి హావ భావాలు, నటనతో యాక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న తిరువీర్.. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో పెర్ఫామెన్స్ పరంగా మెప్పించిన తిరువీర్ సినీ ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ద్రిష్టి తల్వార్ హీరోయిన్‌గా నటిస్తోంది.
రెండు వేర్వేరు ప్రపంచాలు కలయికగా యూనిక్‌నెస్‌తో కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోనర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు తెలిపారు. తిరువీర్ మరో విలక్షణమైన పాత్రలో మెప్పించనున్నారు. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు.