Friday, November 1, 2024

సినీసర్కార్ రివ్యూ: ‘కలశ’

మూవీ టైటిల్‌: కలశ
తారాగణం: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు
ప్రొడ్యూసర్: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
దర్శకత్వం:కొండా రాంబాబు
సినిమాటోగ్రఫీ:వెంకట్‌ గంగధారి
సంగీతం: విజయ్‌ కురాకుల
ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ
రిలీజ్ డేట్: డిసెంబర్‌ 15, 2023

కథ:

వరంగల్‌లో ఉండే తన్వి (భానుశ్రీ)కి డైరెక్టర్ కావాలని కోరిక. దాంతో హారర్ కథను తయారు చేసుకుని నిర్మాతలను కలుస్తుంటుంది. చివరకు ఓ నిర్మాతకు కథ నచ్చుతుంది. అయితే ఆయన క్లైమాక్స్‌లో కాస్త రియాలిటీ ఎలిమెంట్స్ లింక్ చేస్తూ మార్చమని సలహా ఇస్తాడు. దాంతో ఆమె హైదరాబాద్‌లోని తన స్నేహితురాలు కలశ (సోనాక్షి వర్మ) దగ్గరకు వెళ్లి ఆమె ఇంట్లో ఉండి క్లైమాక్స్ మార్చి మళ్లీ ప్రొడ్యూసర్‌ని కలవాలనుకుంటుంది. అందుకోసం ఆమె కలశకు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లమని చెబుతుంది. తన చెల్లెలు అన్షు (రోషిణి) ఉంటుందని కూడా చెబుతుంది. ఇంటికెళ్లిన తన్వికి ఇంట్లో ఎవరో ఉన్నట్లు, దెయ్యాలు తన వెంటపడుతున్నట్లు కలలు వస్తుంటాయి. అన్విత కనిపించదు. దీంతో అన్విత తనను ఆట పట్టిస్తుందని తన్వి అనుకుంటుంది.

అదే సమయంలో తన్వి కదలికలను ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా గమనిస్తుంటారు. రాత్రంతా పిచ్చి పిచ్చి కలలతో ఇబ్బందిపడ్డ తన్వికి తెల్లవారగానే షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలు ఇంట్లో ఉన్న కలశ, ఆమె చెల్లెలు అన్షు ఏమవుతారు. సిటీలో కనిపించకుండా పోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమ్మాయి ఎవరు? ఆమెకు కలశకు సంబంధం ఏంటి? తన్వి ఫ్రెండ్.. రైంటర్ రాహుల్(అనురాగ్)కి కలశకు సంబంధం ఏంటి? తన్విని సీక్రెట్‌గా ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అవుతూ కలశ చిత్రాన్ని హారర్ ఎలిమెంట్స్‌తో పాటు సైకలాజిల్ అంశాలను మిక్స్ చేసి తెరకెక్కించారు. సినిమాను రొటీన్ హారర్ మూవీగానే దర్శకుడు స్టార్ట్ చేశారు. ఇంటర్వెల్ వరకు సినిమా అలాగే సాగుతుంది. అయితే ఇంటర్వెల్ నుంచి ట్రీట్‌మెంట్ మారిపోయింది. అసలు కథ హారర్ కోణంలో కాకుండా సైకలాజికల్ హారర్ కోణంలో సాగిపోతుంది. అసలు అప్పటి వరకు జరిగిన సన్నివేశాలకు కారణమైన అంశాలను ఒక్కొక్కటిగా దర్శకుడు రివీల్ చేసిన తీరు బావుంది. భానుశ్రీ, రచ్చ రవి సన్నివేశాలు నవ్విస్తాయి. ఫస్టాఫ్ లో కామెడీ, హారర్ ప్రధానాంశాలుగా కనిపిస్తాయి. అయితే సినిమాను కాస్త సాగదీసినట్లుగా కూడా అనిపిస్తుంది.

సెకండాఫ్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలు లైమ్ లైట్‌లోకి రావటంతో కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కలశ బ్యాగ్రౌండ్, ఆమె చెల్లెలు అన్షు, సిటీలో కనిపించకుండా పోయిన అమ్మాయి, చంపబడ్డ సీఐ .. అన్విత బాయ్ ఫ్రెండ్ ఇలా సినిమా సాగే కొద్ది ఆసక్తి పెరుగుతూ వస్తుది. ఫస్టాఫ్‌లో కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్‌ జానర్స్‌ని ఇష్టపడేవారికి కలశ నచ్చుతుంది.

నటీనటుల విషయానికి వస్తే .. బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. యంగ్‌ డైరెక్టర్‌ తన్విగా ఆమె చక్కగా నటించింది. తెరపై కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక కలశ పాత్రలో నటించిన సోనాక్షి వర్మ.. చుట్టూనే సెకండాఫ్ నడుస్తుంది. ఆమె తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. అన్షు రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న సీఐగా సమీర్‌, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నికల్ విషయాలను చూస్తే విజయ్‌ కురాకుల నేపథ్యం సంగీతం బావుంది. వెంకట్‌ గంగధారి సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాయే అయినా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు.

సినీసర్కార్ రేటింగ్: 3.5/5

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x