Tuesday, May 20, 2025

భూతద్దం భాస్కర్‌ నారాయణ – డోంట్ మిస్ ఇట్

ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ లో దమ్ము ఉండేదే పెద్ద సినిమా. ‘హనుమాన్’ ఈ విషయాన్ని రుజువు చేసింది. మంచి ప్రమోషనల్ కంటెంట్ తో అలరిస్తే ఆటోమేటిక్ గా ప్రేక్షకుల ద్రుష్టి పడుతుంది. ఈ మధ్య కాలంలో అలా ఆసక్తిని పెంచింది సినిమామా శివ కందుకూరి ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. ఈ సినిమా ప్రచార చిత్రాలు చాలా క్యురియాసిటీని కలిగించాయి. మంచి థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో సినిమా చూడలానే నమ్మకాన్ని ఇచ్చాయి? మరా నమ్మకాన్ని సినిమా నిలబెట్టుకుందా?

భాస్కర్‌ నారాయణ (శివ కందుకూరి) తన అన్నయ్య జీవితంలో జరిగిన ఓ ఘటన కారణంగా చిన్నప్పుడే డిటెక్టివ్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. కొన్నేళ్ళ తర్వాత.. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ఎవరో సైకో కిల్లర్ ఆడవాళ్ళ తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని చేధించడానికి భాస్కర్‌ నారాయణ రంగంలో దిగుతాడు. తర్వాత ఏం జరిగింది? సైకో కిల్లర్ దొరికాడా? దిష్టి బొమ్మ హత్యలు వెనుక వున్న వ్యక్తి ఎవరు ? ఈ కేసులో భాస్కర్‌ నారాయణ ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అనేది మిగతా కథ.

సైకో కిల్లర్ హత్యలకు పురాణ కోణం జోడించాలనే ఆలోచన చాలా ఆసక్తికరమైనది. ఇక్కడే ఈ సినిమాకి ఓ కొత్త ఫ్లావర్ యాడ్ అయింది. హీరో పాత్రని పరిచయం చేసి తీరు అతని జర్నీతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. తొలి సగంలో ఫన్, ప్రేమ పెద్దగా వర్క్ అవుట్ అయ్యేలా అనిపించవు. కథలోకి వెళ్ళడానికి కొంత సమయం తీసుకున్నాడు దర్శకుడు. అయితే సీరియల్ కిల్లర్ ఎపిసోడ్ తెరపైకి వచ్చాక కథని గ్రిప్పింగ్ గా నడిపిన తీరు కట్టిపడేస్తుంది. భూతద్దం భాస్కర్‌ నారాయణ బిగ్ ప్లస్ సెకండ్ హాఫ్. భూతద్దం భాస్కర్‌ నారాయణ సెకండ్ హాఫ్ యూనిక్ కంటెంట్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. పురాణ కోణం ఒక ఫ్రెష్ ఫీలింగ్ ని తీసుకొస్తుంది. కిల్లర్ ఎవరనే సస్పెన్స్ ని చివరి వరకూ చాలా నేర్పుగా కొనసాగించాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథని ముందుకు నడిపిన తీరు బావుంది.

భూతద్దం భాస్కర్‌ నారాయణ పాత్రలో శివ కందుకూరి నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో ఓదిపోయిన తీరు, ఎమోషన్స్ పండించి విధానం బాగా కుదిరాయి. తన పాత్రతో కథలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో శివ మంచి ప్రతిభ కనబరిచాడు. రాశి సింగ్ పాత్ర కూడా కీలకంగా వుంటుంది. దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ పాత్రలు కథకు బలాన్ని తీసుకొచ్చాయి.

శ్రీచరణ్ పాకాల థ్రిల్లర్ స్పెషలిస్ట్. ఈ సినిమాకి ఆయన అందించిన నేపధ్య సంగీతంప్రధాన ఆకర్షణ. సౌండింగ్ తో సస్పెన్స్ ని మరో స్థాయిలో హోల్డ్ చేశాడు. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. ఆర్ట్, ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ ఆకట్టుకునేలా వున్నాయి. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకుల నచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దడంలో దర్శకుడు పైచేయి సాధించాడు.

ప్లస్ పాయింట్స్
కథ, స్క్రీన్ ప్లే
శివ యాక్టింగ్
సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు, నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని రొటీన్ సీన్స్
అక్కడక్కడ కాస్త సాగదీత

ఫైనల్ వర్డ్ : భూతద్దం..డోంట్ మిస్ ఇట్

రేటింగ్: 3

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x