Wednesday, January 22, 2025

వైభవంగా ‘యజ్ఞ’ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

సుభాష్ రావ్ దేశ్ పాండే సమర్పణలో ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యజ్ఞ. ఈ చిత్రంలో సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టి బాబు, చెన్నకేశవ నాయుడు, ఆవిష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలింస్ బ్యానర్స్ పై చిలుకోటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ కథతో దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ యజ్ఞ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ గా పి అర్ కె ఫిలింస్ ద్వారా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా యజ్ఞ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో

నిర్మాత ఆర్కే గౌడ్ మాట్లాడుతూ – యజ్ఞ సినిమా ప్రారంభోత్సవం కూడా మా చేతుల మీదుగానే జరిగింది. ప్రొడ్యూసర్ విఠల్ గౌడ్ మా టీఎఫ్ సీసీ లో సభ్యుడు. హారర్ కామెడీతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. పాటలు బాగున్నాయి. సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఏ హెల్ప్ కావాలన్నా నా వంతు సహకారం అందిస్తాను. యజ్ఞ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – యజ్ఞ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. మంచి క్వాలిటీతో సినిమా చేసినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. హీరో హీరోయిన్ల పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. నిర్మతాలు రఘురాం, విఠల్ గౌడ్ లకు యజ్ఞ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత బసిరెడ్డి మాట్లాడుతూ – హారర్ కామెడీ అనేది సక్సెస్ ఫుల్ ఫార్మేట్. ఈ జానర్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్స్ అయ్యాయి. యజ్ఞ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలి. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ మాట్లాడుతూ – యజ్ఞ సినిమాను కంప్లీట్ చేసేందుకు పెద్ద యజ్ఞమే చేశాం. మొదట సినిమా ప్రారంభించినప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ షూటింగ్ టైమ్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను బాధపడుతుంటే నా స్నేహితుడు రఘురాం, విఠల్ గారు, సుభాష్ రావు గారు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. వీళ్లు దేవుళ్లులా రాకుంటే నా సినిమాను రిలీజ్ అయ్యేది కాదు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాం. లేకుంటే గతేడాదే యజ్ఞ సినిమా విడుదలయ్యేది. క్యూబ్ లు యూఎఫ్ లో చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయి. సెన్సార్ వాళ్ల వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దాటుకుని మూవీని రిలీజ్ కు తీసుకురాబోతున్నాం. సినిమా హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్స్ కు డబ్బులు తీసుకురావాలి. యజ్ఞ సినిమా హారర్ కామెడీ మూవీగా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.

నిర్మాత విఠల్ గౌడ్ మాట్లాడుతూ – మా సినిమాకు మొదటి నుంచి ప్రతాని రామకృష్ణ గౌడ్ , లయన్ సాయి వెంకట్ గారు సపోర్ట్ గా ఉన్నారు. మా డైరెక్టర్ చిత్తజల్లు ప్రసాద్ గారు పట్టుదలగా మూవీ కంప్లీట్ చేశారు. నేను రఘురాం నిర్మాతలం అయినా మమ్మల్ని నడిపించేది సుభాష్ రావు గారే. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాం. గోవాజ్యోతి శివనాయుడు, ప్రదీప్ రెడ్డి, చెన్నకేశవనాయుడు..ఇలా వీళ్లంతా బాగా మూవీకి సపోర్ట్ చేశారు. ఆడియెన్స్ కు మా యజ్ఞ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ గోవా జ్యోతి మాట్లాడుతూ- యజ్ఞ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. యజ్ఞ ఒక డిఫరెంట్ హారర్ కామెడీగా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరో శివ నాయుడు మాట్లాడుతూ – మా సినిమాకు డైరెక్టర్ చిత్తజల్లు ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్స్ రఘురాం, విఠల్ గారు, సుభాష్ గారు ఈ నలుగురు నాలుగు ఫిల్లర్స్. మా మూవీని ఫుల్ మీల్స్ లా డైరెక్టర్ ప్రసాద్ గారు రూపొందించారు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ కు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మా మూవీకి మీడియా సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత చిలుకోటి రఘురాం మాట్లాడుతూ – మా యజ్ఞ సినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. మా మూవీని త్వరలో థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మీ అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

చిత్ర సమర్పకుడు సుభాష్ రావు మాట్లాడుతూ – యజ్ఞ సినిమాకు రఘురాం, విఠల్ గౌడ్ ఇద్దరూ నిర్మాతలు. నేను వారికి సపోర్ట్ గా ఉన్నాను. డైరెక్టర్ ప్రసాద్ ఈ సినిమా చేశారు. సినిమాకు సహకారం కావాల్సిన వచ్చినప్పుడు నా వంతు సపోర్ట్ చేశా. యజ్ఞ మూవీ మంచి హిట్ కావాలి. సినిమా నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పేరు తేవాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణసాయి మాట్లాడుతూ – యజ్ఞ సినిమాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం దక్కింది. దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ గారు తమ పాటల సందర్భానికి తగినట్లు సాంగ్స్ చేయించుకున్నారు. ఇలాంటి మంచి మూవీకి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

నటీనటులు – ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి, సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టి బాబు, చెన్నకేశవ నాయుడు, ఆవిష్, లాయర్ సుబ్బారెడ్డి, అశోక్ నాయుడు, తిరుపతి, ఓంకార్, కరుణాకర్, చిత్తజల్లు నాగరాజు, సునీత తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ- జి.కృష్ణ నాయుడు, సుధాకర్ నాయుడు.కె
మ్యూజిక్ – లక్ష్మణ సాయి
పాటలు – గడ్డ సీతారామ చౌదరి, శ్రీ ప్రసాద్
ఫైట్స్ – హుస్సేన్ భాయ్
కొరియోగ్రఫీ- బండ్ల రామారావు, తాజ్ ఖాన్
పోస్ట్ ప్రొడక్షన్ – విజన్ స్టూడియోస్ రమేష్
రిలీజ్ – పీఆర్కే ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్
పీఆర్ఓ – వీరబాబు
బ్యానర్స్ – ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలింస్
నిర్మాతలు – చిలుకోటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – చిత్తజల్లు ప్రసాద్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x