Saturday, December 28, 2024

‘గేమ్ చేంజర్’ మూడో పాట ‘నానా హైరానా’ వచ్చేసింది

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచ‌నాల న‌డుమ 2025లో విడుద‌ల‌వుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతున్న కొద్ది రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జోడీ మ‌ధ్య కెమిస్ట్రీని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఎంత గొప్ప‌గా తెర‌కెక్కించారోన‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుద‌లైంది. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. త‌మిళంలో ‘లై రానా’ అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఈ పాట ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌న‌ప‌రుస్తోంది. ఈ పాట‌ను తెలుగులో రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాయ‌గా, త‌మిళంలో వివేక్‌, హిందీలో కౌశ‌ర్ మునీర్ రాశారు. ఈ పాట‌కు సంబంధించిన బీటీఎస్‌కు కూడా ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఇక రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జోడీ పాట‌లోని స్వ‌చ్చ‌త‌ను హావ‌భావాల రూపంలో ప‌లికించారు. పాట విడుద‌ల కాగానే ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

ప్రేమ‌లో ఉన్న హీరో హీరోయిన్లు ఒక‌రిపై ఒక‌రికి మ‌న‌సులోని ప్రేమ భావాలు ప‌దాల రూపంలో అందంగా అమ‌ర్చిన‌ట్లు కుదిరాయి. ఇక మేకింగ్ విష‌యానికి వ‌స్తే శంక‌ర్ మ‌రోసారి పాట‌ల‌ను చిత్రీక‌రించ‌టంలో త‌న‌కు తానే సాటి అని మ‌రోసారి నా నా హైరానా పాట‌తో నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ పాట‌ను ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీక‌రించారు. ఒక్కో స‌న్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువ‌ల్ బ్యూటీతో పాట మ‌న‌సుని తేలిక ప‌రుస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకునేంత గొప్ప‌గా పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ పాట‌ను ఫ్యూజ‌న్ మెలోడీ (వెస్ట్ర‌న్‌, క‌ర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. అలాగే బ‌ర్న్ట్ టోన్స్‌ను ఉప‌యోగించారు.. రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాట‌లో ఉప‌యోగించ‌టం విశేషం.

సారెగ‌మ మ్యూజిక్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నగేమ్ చేంజ‌ర్ సినిమాలోని ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాటను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా అనౌన్స్ చేసిన పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్లో పాట‌పై అంచ‌నాల‌ను ఎంత‌గానో పెంచింది. ఇప్పుడు పాట విడుద‌ల‌య్యాక పాట వారి అంచ‌నాల‌ను మించి ఉంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి విడుద‌లైన‌ ‘జ‌ర‌గండి జ‌ర‌గండి’… ‘రా మ‌చ్చా రా.. ’ పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌లైన మూడో సాంగ్ ‘నా నా హైరానా’ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది.

రీసెంట్‌గా విడుద‌లైన ‘గేమ్ చేంజర్’ టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూపించ‌న‌టువంటి ఓ స‌రికొత్త అవ‌తార్‌లో శంక‌ర్ ఆవిష్క‌రిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర చేయ‌టంతో పాటు స‌మాజానికి సేవ చేయాల‌నుకునే ఉత్సాహ‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లోనూ క‌నిపించ‌నున్నారు. సినిమాలో హై రేంజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు, పొలిటిక‌ల్ ఎలిమెంట్స్‌, ఆక‌ట్టుకునే క‌థ‌నం, న‌టీన‌టుల అద్భుత‌మైన ప‌నితీరు ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతినిస్తాయి.

ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, శ్రీకాంత్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ రోల‌ర్ కోస్ట‌ర్‌గా మూవీ అల‌రించ‌నుంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

‘గేమ్ చేంజర్’ సినిమాను త‌మిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుద‌ల చేస్తుండ‌గా హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ త‌డానీ విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ క‌ల్లెప‌ల్లి ఆధ్వ‌ర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x