Friday, November 1, 2024

‘ఆహా’ లో విడుద‌ల‌వుతోన్న ‘అర్ధశతాబ్దం’

తెలుగు ప్రేక్ష‌కుల చేతుల్లోకి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది హండ్రెడ్ ప‌ర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇందులో ఎక్స్‌క్లూజివ్ మూవీగా జూన్ 11న విడుదలవుతున్న చిత్రం ‘అర్ధశతాబ్దం’. కార్తీక్ ర‌త్నం, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, కృష్ణ ప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌కుడు. సోమ‌వారం ఈ చిత్ర యూనిట్ జూమ్ మీటింగ్‌లో చిత్ర విశేషాల‌ను తెలియ‌జేసింది.

ద‌ర్శ‌కుడు ర‌వీంద్ర పుల్లె మాట్లాడుతూ.. ‘‘మన చుట్టూ ఉన్న స‌మాజంలోని అస‌మాన‌త‌ల‌ను ఆధారంగా చేసుకుని అర్ధశతాబ్దం క‌థ‌ను రాసుకున్నాను. ఇలాంటి క‌థ‌ను ఆడియెన్స్‌కు న‌చ్చేలా ఎలా తెర‌కెక్కించాల‌ని బాగా ఆలోచించి, అందుకు త‌గిన‌ట్లు న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకుని చేసిన సినిమా ఇది. న‌వీన్ చంద్ర‌, శుభ‌లేక సుధాక‌ర్‌, సాయికుమార్ ఇలా ప్ర‌తి పాత్ర చాలా ప్రాముఖ్య‌త‌తో ఉంటుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ నెల 11న మా సినిమాను ఆహా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నాం. అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం. ఆహా టీమ్‌కు మా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు’’ అని తెలిపారు.

న‌వీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి ర‌వీంద్ర నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేన‌ని అన్నాను. అప్పుడు ఉమేష్ చంద్ర‌గారి పాత్ర‌ను బేస్ చేసుకుని ఈ పాత్ర‌ను డిజైన్ చేశాన‌ని చెప్ప‌డంతో ఆస‌క్తిక‌రంగా అనిపించి, సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ పాత్ర‌’’ అన్నారు.

కృష్ణ ప్రియ మాట్లాడుతూ.. ‘‘హీరోయిన్‌గా చేయాల‌ని న‌న్ను సంప్ర‌దించి క‌థ చెప్పిన‌ప్పుడు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించింది. క‌థ విన‌గానే భాష‌తో సంబంధం లేకుండా సినిమా చేయాల‌ని అనుకున్నాను. ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులతో క‌లిసి ప‌నిచేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభ‌వం’’ అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘చాలా ఇంట్రెస్టింగ్, ఇన్‌టెన్స్‌, డైలాగ్ ఓరియెంటెడ్ పాత్ర‌లో న‌టించాను. ప్ర‌స్థానంలో నా పాత్ర‌లోని డైలాగ్స్‌కు చాలా డెప్త్ ఉంటుంది. ఆ త‌ర్వాత అంత డెప్త్‌లో డైలాగ్స్ ఉన్న సినిమా ఇది. ఆహా లాంటి ఫ్లాట్‌ఫామ్ దొర‌క‌డం మన తెలుగు ఇండ‌స్ట్రీ అదృష్ట‌మ‌నే చెప్పాలి. నోఫెల్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆలోచ‌న‌, ఆవేశాన్ని క‌లిగించే సినిమా. అన్ని ఎలిమెంట్స్ చ‌క్క‌గా కుదిరాయి’’ అన్నారు.

శుభ‌లేక సుధాక‌ర్ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో పరిస్థితులు, ప్రాముఖ్యతలు మారిపోవడం వల్ల మంచి చేయాలనుకున్న వ్యక్తులు కూడా మంచిని సకాలంలో చేయలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి నా బాధ్యత అని ఫీలై చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అదే అర్ధ శతాబ్దం మూవీ’’ అన్నారు.

నిర్మాత చిట్టి కిర‌ణ్ రామోజు మాట్లాడుతూ.. ‘‘నా టీమ్ ఎంతో స‌పోర్ట్ చేశారు కాబ‌ట్టి సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైరెక్ట‌ర్ ర‌వి సినిమాను అద్భుతంగా మ‌లిచాడు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ రావ‌డ‌మే సినిమా బాగా వ‌చ్చింద‌న‌డానికి ఉదాహ‌ర‌ణ‌. ఆహా యాజ‌మాన్యానికి, టీమ్‌కు థాంక్స్‌. జూన్ 11న అర్ధ శ‌తాబ్దం విడుద‌ల‌వుతుంది. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

కార్తీక్ ర‌త్నం మాట్లాడుతూ.. ‘‘ఇందులో దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడిగా న‌టించాను. అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి, అనుకోని ప‌రిస్థితుల్లో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల్లో చిక్కుకుంటాడు. అక్క‌డ నుంచి అత‌ని జీవితం ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. సాయికుమార్‌గారు, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌, న‌వీన్ చంద్ర వంటి సూప‌ర్బ్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాను. ట్రైల‌ర్‌కు, పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. డైరెక్ట‌ర్ ర‌వీంద్ర‌గారికి థాంక్స్‌. అలాగే ఆహా వారికి స్పెష‌ల్ థాంక్స్‌’’ అన్నారు.

నటీనటులు:
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కృష్ణ‌ప్రియ‌, సుహాస్‌, సాయికుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ప‌విత్రా లోకేశ్‌, అజ‌య్‌, రాజా ర‌వీంద్ర‌, రామరాజు, దిల్ ర‌మేశ్‌, టి.ఎన్‌.ఆర్‌, శ‌ర‌ణ్య‌, న‌వీన రెడ్డి, అమ్మ‌ణ్ణి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: రిషిత శ్రీ క్రియేష‌న్స్ ఎల్ ఎల్ పి
డైరెక్ట‌ర్‌: ర‌వీంద్ర పుల్లె
నిర్మాత‌లు: చిట్టి కిర‌ణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట ఆర్‌.శాఖ‌మూరి
సంగీతం: నోఫెల్ రాజ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x