ప్రముఖ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సంఘసేవా సంస్థ బల్లెం వేణు మాధవ్ ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డ్ ప్రదానోత్సవం సందర్భంగా డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకున్నారు ‘బాలమిత్ర’ చిత్ర దర్శకుడు శైలేష్ తివారి. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా దర్శకుడు శైలేష్ తివారి ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ తివారి మాట్లాడుతూ.. ‘‘నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీ వారికి, అవార్డు ఇచ్చిన బల్లెం వేణు మాధవ్ ఆర్ట్ థియేటర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ‘బాలమిత్ర’ చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నిర్మాత బొద్దుల లక్ష్మణ్‌గారి సహకారం మరిచిపోలేనిది. ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.