Wednesday, January 22, 2025

మెగాస్టార్ చిరంజీవి వదిలిన ‘బబుల్‌గమ్’ ఇజ్జత్ సాంగ్

రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ ఇప్పటికే హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ఒక పాట, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వస్తోంది. నేచురల్ స్టార్ నాని టీజర్‌ను విడుదల చేయగా, విక్టరీ వెంకటేష్ ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సెకండ్ సింగిల్- పవర్ ఫుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆంథమ్‌ ‘ఇజ్జత్’ సాంగ్ ని లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సుమ, రాజీవ్ కనకాల సుపుత్రుడు రోషన్ నటించిన తొలి సినిమా ‘బబుల్‌గమ్’ రెండవ సింగిల్ ఇజ్జత్ పాటని నా చేతులు మీదగా విడుదల చేయడం చాలా సంతోషంగా వుంది. తొలి పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రెండవ పాట యూత్ ని రాక్ చేస్తుందన్న నమ్మకం వుంది. అంత హుషారుగా ఈ పాట వుంది. ‘బబుల్‌గమ్’ ట్రైలర్ చూశాను. చాలా ఆకట్టుకుంది. యూత్ ఆకట్టుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన దర్శకుడు రవికాంత్ ని అభినందిస్తున్నాను. శ్రీచరణ్ పాకాల చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఆ ర్యాప్ సాంగ్ లో నాకైతే రోషన్ తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది. అంత హుషారుగా వుంది. ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో మార్మ్రోగిపొతుందని చెప్పడంలో అనుమానం లేదు. కథానాయికగా మానస చాలా అద్భుతంగా నటించింది. తను మన తెలుగమ్మాయే కావడం అభినందనీయం. సుమ, రాజీవ్ ఎంతో ఆనందపడే, గర్వపడే క్షణాలు అతి త్వరలోనే రాబోతున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ‘బబుల్‌గమ్’ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” తెలిపారు.

ఇజ్జత్ పాట విషయానికి వస్తే.. ”మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి,  మీ ప్రేమ సంపూర్ణంగా అనిపిస్తుంది. ఎందుకంటే- “ఇజ్జత్…ఇచ్చి పుచ్చుకుంటే మంచిది”అని ఈ పాట ద్వారా యంగ్ టీం ప్రపంచానికి చాటి చెబుతుంది. ఇజ్జత్ సాంగ్ అందరికీ, ముఖ్యంగా యువతకు మంచి సందేశంతో కూడిన పాటగా స్వరపరిచారు శ్రీచరణ్ పాకాల. ఎంఎస్ హరి అందించిన లిరిక్స్ క్యాచిగా వున్నాయి. ఎంఎస్ హరి, రోషన్ కనకాల ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించారు. రోషన్ కనకాల తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. వైబ్రెంట్ సెట్స్‌లో, కొన్ని రియల్ లొకేషన్స్‌లో ఈ పాటని గ్రాండ్ గా చిత్రీకరించారు. విజువల్స్ అద్భుతంగా వున్నాయి.  ఇజ్జత్ సాంగ్  పవర్ ఫుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆంథమ్‌, ఇది అన్ని మ్యూజిక్ చార్ట్‌లను రాక్ చేయబోతోంది.

మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా “బబుల్‌గమ్” రూపొందించారు. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సరికొత్త రొమాంటిక్ జర్నీతో ప్రేక్షకులని ఆకట్టుకోనుంది. ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన టెక్నికల్ టీంతో “బబుల్‌గమ్” తెలుగు సినిమా ప్రపంచంలో తప్పక చూడవలసిన చిత్రంగా వుండబోతుంది.

గరుడవేగ, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ కాగా, ‘తల్లుమల’ ఫేమ్ కేరళ స్టేట్ అవార్డ్ విన్నర్ నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x