Thursday, November 21, 2024

నన్ను నమ్మింది ప్రేక్షకులు మాత్రమే: విశ్వక్ సేన్

యంగ్ హీరో విష్వ‌క్‌సేన్, నివేద పేతురేజ్, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ హీరో హీరోయిన్లుగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగ‌ల్‌`. ఈ సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌లై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, ఈ సందర్బంగా సోమవారం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ నివేద పేతురేజ్ మాట్లాడుతూ ..చాలా ఆనందంగా ఉంది .. ఈ సినిమా విజయం. ఇది ఎమోషనల్ జర్నీ మాకు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మేము పెట్టిన ఎఫర్ట్ కు మంచి ఫలితం వచ్చింది. ఏ సినిమా విషయంలో అయినా టీం సపోర్ట్ ఉంటె తప్పకుండా అది మరో రేంజ్ సినిమా అవుతుంది. ఆలా మా టీం ఇచ్చిన సపోర్ట్ తో అందరం ఎఫర్ట్ పెట్టి సినిమా తీసాం. కరోనా సమయంలో ఎన్నో కష్టాలకు తట్టుకుని ఈ సినిమా చేసాం. తప్పకుండా మా మంచి ప్రయత్నాన్ని అందరు ఆదరించారు. మా హీరో విశ్వక్ సేన్ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అతనికి సినిమా అంటే ఇష్టం. విశ్వక్ ఎఫర్ట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. మరో సారి అతను ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ .. లాంగ్ జర్నీ పాగల్. కరొనాకు ముందు స్టార్ట్ అయింది. ఈ సినిమా విషయంలో దర్శకుడు నరేష్ కి థాంక్స్ చెప్పాలి. మూడేళ్ళుగా ఈ కథతో పాటు, నాతోపాటు ట్రావెల్ అయ్యారు. అలాగే మణికందన్ గారు చాలా థాంక్స్ .. సినిమా బాగా రావడానికి చాలా ఓపికగా చేసారు, అలాగే రధన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు .. అలాగే అందరు టెక్నీషియన్స్ కు థాంక్స్ చెప్పాలి. అలాగే ఆర్ ఆర్ బెస్ట్ గా ఇచ్చాడు. సినిమా విషయంలో చాలా టెన్షన్ పడ్డం. కానీ ఈ టీం మొత్తం సపోర్ట్ అందించిన అందరికి స్పెషల్ గా థాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ అందించారు. అలాగే సిమ్రాన్, నివేద, ఇలా అందరికి థాంక్స్ చెప్పాలి. ముక్యంగా విశ్వక్ కు పెద్ద థాంక్స్ చెప్పాలి. విశ్వక్ ఈ సినిమా విషయంలో అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. నేను ప్రొడ్యూసర్ గా ఉన్నా కూడా ప్రొడక్షన్, టెక్నీకల్ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్న విశ్వక్ కు థాంక్స్ ముందు ముందు కూడా నీకు బ్రైట్ ఫుచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే దిల్ రాజుగారు, శిరీష్ నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. కరోనా సమయంలో కూడా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు.. సినిమా ఓటిటి లో విడుదల అంటారో అని కానీ నా మాట నమ్మి దిల్ రాజు గారు ఈ సినిమాను థియటర్స్ లోనే విడుదల చేయాలనీ వారు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాలి.

హీరోయిన్ మేఘ మాట్లాడుతూ .. ఇంత మంచి హిట్ అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. అందరికి థాంక్స్ చెప్పాలి. లాస్ట్ మండే సినిమా ఎలారా బాబు సినిమాను జనాల దగ్గరికి తీసుకెళ్లాలి అనుకున్నాం .. ఎలా అంటే నేను దిల్ రాజు గారికి, శిరీష్ కు, వేణు గారికి చెప్పాను.. కానీ ఎలా రా బాబు అని చాల టెన్షన్ పడ్డాను .. ఎలాగైనా సరే సినిమాను థియటర్స్ లో చూడాలన్నది నా కోరిక. కరోనా కారణంగా రెండు నెలలు థియేటర్స్ క్లోజ్ అయ్యాయి.. సినిమాలు చూడలేదు.. ఎలా అనుకున్న సమయంలో జనాల దగ్గరికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ సినిమా విషయంలో ఎవరైనా పుష్ ఇస్తే బాగుండు .. కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండేది అనుకున్నాను .. కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. అయినా సరే మన సినిమా మనమే ప్రమోట్ చేసుకోవాలని చాలా కష్టపడి సినిమాను విడుదల అనుకున్న సమయానికి తెచ్చాము .. అయితే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది లేకుంటే నేను పేరు మార్చుకుంటా అని చెప్పాను. ఈ సినిమా విడుదల తరువాత చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని చూస్తున్నారు. కానీ ఈ సినిమా హిట్ తో నా నమ్మకం నిజమైంది, నా నమ్మకం వమ్ము కాదని మ రోసారి ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. ఇప్పుడు నేను పెరుమార్చుకోవలసిన అవసరం లేదు . నేను హీరోగా చేసిన హిట్ సినిమా ‘హిట్’ కలెక్షన్స్ కంటే పాగల్ కలక్షన్స్ 40% ఎక్కువ వచ్చాయి. నాకు, ఆడియన్స్ కి మధ్యలో ఎవరు లేరు. ఈ సినిమాతో నాకు ఆడియెన్స్ తప్ప ఎవరూ లేరని అర్థం అయింది. నన్ను కాపాడేది మీరు. శని, ఆది 6.5 కోట్ల గ్రాస్ కొట్టింది సినిమా. సింగిల్ స్క్రీన్స్ ఊగిపోతున్నాయి.. ఇంతకంటే ప్రూఫ్ ఏమి కావాలి. ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నా, కరోనా సమయంలో ఆక్యుపెన్సీ సగం ఉన్నా, ఆలాగే సెకండ్ షో లేకపోయినా కూడా ప్రేక్షకులు నా సినిమాకు వచ్చారు. నేను నమ్మింది ప్రేక్షకులను.. వారు నా నమ్మకాన్ని నిజం చేసారు. ఎన్ని కష్ఠాలు ఉన్నా కూడా నాకు డైరెక్ట్ సపోర్ట్ చేసింది కేవలం ప్రేక్షకులు మాత్రమే. సినిమా కోసం చాలా మంది నెగిటివ్ గా ప్రమోట్ చేసారు. అయినా సరే నాకు మంచి విజయాన్ని అందించారు ప్రేక్షుకులు. నన్ను ప్రేక్షకుల దగ్గరికి చేర్చింది మీడియా వారికి థాంక్స్, అలాగే నన్ను నమ్మింది మాత్రం ప్రేక్షకులే, నిజంగా వారికీ థాంక్స్ చెప్పాలి. సినిమా విషయంలో చాల మంది రకరకాల కామెంట్స్ చేసారు .. కానీ వారికి సమాధానం ఈ సినిమా విజయం చెప్పింది . నాకు ప్రేక్షకులే తప్ప వెనక గాడ్ ఫాథర్ లేరు.. నాకు సపోర్ట్ చేసేది మీరే, నన్ను కాపాడేది మీరే మీ అందరికి మరోసారి థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x