Thursday, November 21, 2024

కమర్షియల్ రివేంజ్ డ్రామా… షాన్-లవ్ వార్

కమర్షియల్ రివేంజ్ డ్రామా… షాన్-లవ్ వార్

కుమార్ యాదవ్, ప్రియా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘షాన్-లవ్ వార్’. ఈ చిత్రాన్ని చిత్ర కథానాయకుడు కుమార్ యాదవ్ నిర్మించి… దర్శకత్వం వహించారు. ఎ.కుమార్ యాదవ్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం సచిత్ సాయి అందించారు. వంగమయి పటేల్ కీలక పాత్రలో నటించగా… జోహార్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. మరి షాన్-లవ్ వార్… ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: శివాజి ఎంతో ప్రతిభగల ఇంజనీర్. ఓ గౌరవప్రదమైన జమిందారుడి కుమారుడైన శివాజికి… తన తండ్రి వారసత్వంగా ఓ క్వారీని అప్పజెప్పుతాడు. శివాజి, సుమంగళి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే క్వారీపై కన్నేసిన అత్యంత దురాశపరుడైన జగ్గు భాయ్(జోహార్)… శివాజిని అతి కిరాతకంగా మట్టుబెడతాడు. దాంతో తల్లి సుమంగళి గ్రామస్తుల మద్దతుతో తన కుమారుడైన షాన్ ని… క్వారీని కాపాడుకుంటుంది. షాన్(కుమార్ యాదవ్)ని ఎంతో ధైర్యసాహసాలతో పెంచాలనుకుంటుంది తల్లి. అందుకోసం అతన్ని అన్ని విధాలుగా ట్రైనప్ చేస్తుంది. అదే సమయంలో జగ్గుభాయ్ కుమార్తె సునయన(ప్రియా చౌదరి), షాన్ ప్రేమించుకుంటారు. అయితే ఆమెకు తన తండ్రి చేసే పాపల గురించి… మోసాల గురించి తెలియదు. చివరకు జగ్గభాయ్ చేసే అక్రమాలకు అరికట్ట వేసి… అతని నుంచి క్వారిని ఎలా కాపాడగలిగారన్నదే మిగతా కథ.

నటీనటుల విషయానికొస్తే… షాన్ పాత్రలో కుమార్ యాదవ్ అద్భుతంగా నటించారు. అతనికి జంటగా నటించిన ప్రియా చౌదరి కూడా షాన్ లవ్ గా… ప్రతినాయకుని(జోహార్) కూతురుగా మెప్పించింది. ప్రతినాయకుని పాత్రలో జోహార్ ఆకట్టుకున్నాడు. మితా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మెరకు నటించి మెప్పించారు. ఇదొక రివేంజ్ డ్రామా కాబట్టి… పాత్రలన్నీ కథ… కథనం మేరకు నటించి ఆకట్టుకున్నాయి.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… ఈ చిత్ర హీరో కం డైరెక్టర్, నిర్మాత అయినటువంటి కుమార్ యాదవ్ ఓ మంచి రివేంజ్ డ్రామా కథను రాసుకుని, దాన్ని ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ముఖ్యమైన శాఖలను అన్నింటిని హ్యాండిల్ చేసే సత్తా ఉన్న హీరో కం డైరెక్టర్ కుమార్ యాదవ్. రామ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. సచిత్ సాయి సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఎడిటర్ నరేష్ దొరపల్లి చేసిన ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. హీరోనే నిర్మాత కాబట్టి… నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

విశ్లేషణ: రివేంజ్ డ్రామాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చాలా సినిమాలు ఈ జోనర్ లో వచ్చినా… వైవిధ్యమైన కథ… కథనంతో సినిమాని తెరకెక్కిస్తే… ప్రేక్షకుల్ని ఇట్టే… బాక్సాఫీస్ వైపు నడిపించొచ్చని నిరూపించిన సినిమా షాన్. లవ్ వార్ అనేది క్యాప్షన్. దీనికి తగ్గట్టుగానే విలన్ కూతురితో హీరో చేసే రొమాంటిక్ సన్నివేషాలు యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ ఎంటర్టైనర్ కథలు ఎప్పుడూ రొటీన్ అనిపించినా… ఇందులో మాత్రం ఈ అంశాలుంటనే రివేంజ్ డ్రామా కథ… ఆకట్టుకుంటుంది. ఓ వైపు ప్రేమకథను నడిపిస్తూనే… మరోవైపు విలన్ అండ్ గ్యాంగ్ పై ప్రతీకారం తీసుకునే అంశాన్ని చాలా హీరోయిజంగా చూపించారు. ఈ చిత్ర కథానాయకుడు కుమార్ యాదవ్ అన్నీతానై ముందుండి సినిమాని ఎంతో ఉన్నతంగా నిర్మించి విడుదల చేశారు. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x