యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు ‘సార్’ దృశ్య మాలిక నేడు చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు అంబరాన్నంటిన ధనుష్ అభిమానుల ఆనందం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు) ‘వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదల అయింది. దీనికి ఈరోజు చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు వేదిక అయింది.
విడుదల అయిన ధనుష్ ‘సార్’ టీజర్ పరికిస్తే
యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు ‘సార్’ దృశ్య మాలిక అనిపిస్తుంది. పాత్రల మధ్య సంభాషణలు సైతం ఇందుకు అద్దం పడతాయి.
‘‘జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్’’ ఇదే రా ఇప్పటి ట్రెండ్. పాత్ర అంటుంది ఓ సందర్భంలో..
మరోచోట ఓ లెక్చరర్ ‘‘త్రిపాఠి మన కాలేజ్ లోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీ కి పంపించేస్తే మన దగ్గరకి వచ్చి చదువుకునేది ఎవరు…!’’ అంటారు….
సమాధానంగా ‘‘మనం పంపేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని’… అని. ఆ పాత్ర సమాధానం.
‘‘సార్… మై సెల్ఫ్
బాల గంగాధర్ తిలక్
త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్..
అంటూ ఇందులో మనకు కనిపించే ‘సార్’
‘‘విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే
నైవేద్యం తో సమానం. పంచండి …
ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి’’ అంటాడు కథానాయకుడు ధనుష్ ఆవేదన మిళితమైన తీవ్ర స్వరంతో…. ముగింపుగా’’
విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా సాగే
ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు
‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది. అరవై తొమ్మిది క్షణాల పాటు సాగే ఈ టీజర్ ‘సార్’ పై మరింత అంచనాలు పెరిగేలా చేసింది.
టీజర్ విడుదలైన క్షణం నుంచే తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు సరైన బహుమతి అన్నట్లుగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ అక్టోబర్ లో విడుదలకానుంది.
తారాగణం: ధనుష్, సంయుక్తా మీనన్, సాయికుమార్, తనికెళ్ల భరణి , సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.