ఎస్‌ఎమ్ 4 ఫిలిమ్స్ పతాకంపై బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో ‘కాలం రాసిన కథలు’ అనే నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ నూతన చిత్రానికి ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ రాజ్ క్లాప్ ఇవ్వగా.. వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ కుమార్ స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘కాలం రాసిన కథలు’ చిత్రానికి దర్శకుడు, నిర్మాత బాధ్యతలను సాగర్ వహిస్తున్నాడు. తను చాలా అద్భుతంగా కథను రాసుకున్నాడు… క్యాస్టింగ్ కూడా మంచి నటీనటులు ఇందులో ఉన్నారని తెలిపాడు. ఫ్యాన్ ఇండియా సినిమాల ఓపెనింగ్‌లకు ఎలాగూ మనల్ని పిలవరు.. పిలిచిన సినిమాలకు సపోర్ట్ అందించాలనే పిలవగానే వచ్చాను. సినిమాలలో చిన్న- పెద్ద అనేవి ఏవీ ఉండవు.. ఏ సినిమాకైనా ఒకే కెమెరా, ఒకే కష్టం ఉంటుంది.. అందుకే సాగర్ అందిస్తున్న ఈ నూతన చిత్రానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఇందులో నటించిన వారందరికీ మంచి సక్సెస్ చేకూరాలని ఆశిస్తున్నాను.. అన్నారు.
కార్పొరేటర్ దేదీప్య విజయ్ కుమార్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుంది.. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సాగర్ కు మంచి విజయాన్ని అందించాలని బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నాను అన్నారు.
దర్శకుడు, నిర్మాత సాగర్ మాట్లాడుతూ… కాలం రాసిన కథలు నూతన చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన పృథ్వీరాజ్ గారికి, కార్పొరేటర్ దేదీప్యగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదివరకు నేను ‘కొంటె కుర్రాడు’ అలియాస్ లోఫర్ గాడి ప్రేమ కథ అనే చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించి విడుదలకు సిద్ధంగా ఉంచాను. ఇప్పుడు ఈ నూతన చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాను. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని ధైర్యం కుటుంబం మాత్రమే ఇవ్వగలదు అనేదే ‘కాలం రాసిన కథలు’ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో వెన్నెల, రీతూలు లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ఆర్టిస్టులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.. అని తెలిపారు. ఇంకా ఈ ప్రారంభోత్సవంలో అతిథిగా ప్రసన్న కుమార్, కథానాయికలు వెన్నెల, రీతూ, కొరియోగ్రాఫర్ వి నైన్ విజయ్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు.
వెన్నెల, రీతూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
నిర్మాత- రైటర్- డైరెక్టర్: ఎమ్‌ఎన్‌వి సాగర్,
డిఓపి: దేవి వరప్రసాద్,
ఎడిటర్: మేకల మహేష్,
మ్యూజిక్: మెరుగు అరమాన్,
లిరిక్స్: శ్రీనివాస్ తమ్మిశెట్టి,
కొరియోగ్రఫీ: వి నైన్ విజయ్ మాస్టర్,
పబ్లిసిటీ డిజైనర్: ఎమ్ కె ఎస్ మనోజ్,
పీఆర్ఓ: బి. వీరబాబు.