ప్రస్తుత సమాజంలో స్త్రీలంటే ఒక ఆట బొమ్మగా చూస్తున్నారు. ఆ స్త్రీ పై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్న చిత్రమే ‘ఇది కల కాదు’ అన్నారు దర్శకుడు అదీబ్ నజీర్. ఇందులో ప్రతి ఫ్రేమ్ మన చుట్టుపక్కల జరుగుతున్న యథార్థ సంఘటనలేనని ఆయన తెలిపారు. పరింద ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అదీబ్ నజీర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఇది కల కాదు’. మంచి సందేశాత్మక చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదలయ్యేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అదీబ్ నజీర్ మాట్లాడుతూ.. ‘‘సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఈ చిత్రాన్ని చేశాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. చిత్రంలోని ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన మధ్య తిరుగుతున్న మనుషుల జీవితాలే.. ఈ చిత్రంలో పాత్రలుగా కనిపిస్తాయి. ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రలో నేను కూడా కనిపిస్తాను. ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖులు.. గొప్ప సినిమా తీశావని.. ఇలాంటి సినిమాలు నేటి సమాజానికి అవసరమని అప్రిషియేట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మార్చి 26న చిత్రం విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని చూసి.. ఇలాంటి ఇతివృత్తం కలిగిన సినిమాలు నిర్మించేందుకు మనోధైర్యాన్ని, అవకాశాన్ని కల్పించాలని, ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.
అదీబ్ నజీర్, దానికా సింగ్, షఫీ, బెనర్జీ, వైభవ్ సూర్య, పూజిత జొన్నలగడ్డ, డాక్టర్ శ్రీజ, విద్యాసాగర్, మహి మహేంద్ర, బాషా, జామా, షేక్ గుల్జార్ గౌస్, నరేంద్ర దావడా, హారిక, మాధవి, రజియా, అనిల్, సురేష్, శ్రీధర్ స్వామి, లక్ష్మణ్, దీపు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వి.సత్యానంద్, సహ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రుబియా కౌ కబ్, కో డైరెక్టర్: షేక్ గుల్జార్ గౌస్, అసిస్టెంట్ డైరెక్టర్: నరేంద్ర దావడా; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అదీబ్ నజీర్