కరోనా కష్టకాలంలో జీవన్ కుమార్ చేస్తున్న సేవలు నిర్మల్ జిల్లా గండి గోపాల్ పూర్, కట్టకింది గూడం, గండి గూడం, చెరువు కింద గూడంలో కొనసాగాయి. వారికి నిత్యావసరాలను అందించి వారికి అండగా నిలిచాడు జీవన్ కుమార్. ఇప్పటికీ కనీస సదుపాయాలకు నోచుకొని ప్రాంతాలలో ప్రజలను కలుసుకొని వారికి నిత్యావసరాలను, మాస్క్, శాటైజర్స్ ని అందించాడు జీవన్ కుమార్. ప్రకృతికి దగ్గరగా జీవనంగా సాగించే వారి జీవితాలు కరోనా కారణంగా కష్టాలను చూస్తున్నాయి. ఈ ప్రాంతాలలో నివసిస్తున్న 350 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ప్రవీణ్ కుమార్, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ శ్రీధర్, కడం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ రాహుల్, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జీవన్ కుమార్ చేస్తున్న సహాయక చర్యలను పోలీస్ శాఖవారు ప్రశంసించారు. ఎజెన్సీ ఏరియాలలో జీవన్ చేస్తున్న సహాయం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. NGO’s సమారిటన్స్ ఫర్ ది నేషన్, ప్రాజెక్ట్ అన్నపూర్ణ, లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ మరియు జీవన్ కుమార్ వారి సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు కడం పోలీస్ స్టేషన్ పరిదిలోని గండిగోపాల్ పూర్, కట్టకింది గూడం, గండి గూడం, చెరువు కింది గూడం, మిద్దచింత, రాంపూర్, మైసంపేట మరియు ఉడుంపూర్ గ్రామస్తులకు పంపిణీ చేశారు.
కరోనా సెకండ్ వేవ్ లో జీవన్ కుమార్ చేస్తున్న సహాయం చాలా మందికి అండగా నిలుస్తుంది. ప్రతిరోజూ 300కి పైగా కరోనా పేషెంట్స్ కి భోజనం అందిస్తున్నాడు. పరిశ్రమలో చాలామంది జీవన్ కుమార్ కి తోడుగా నిలుస్తున్నారు. తన దగ్గర కు వచ్చి ప్రతి అభ్యర్దనను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాడు జీవన్ కుమార్. సినిమా నటడిగా అందరికీ పరిచయం అయిన జీవన్ చేస్తున్న సహాయక చర్యలపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.