Wednesday, January 22, 2025

‘కల్లు కాంపౌండ్ 1995’ ట్రైలర్ లాంచ్

ఎంటర్టైన్మెంట్ తోపాటు.. మంచి మెసేజ్ ఇస్తే సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారు. అలాంటి కోవలో రాబోతున్న మూవీ ‘కల్లు కాంపౌండ్ 1995’. గణేష్, ఆయూషి పటేల్ జంటగా బ్లూ హారీజోన్ మూవీ ప్యాక్టరీ బ్యానర్ పై ప్రవీణ్ జెట్టి దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘కల్లు కాంపౌండ్ 1995’. పోసాని కృష్ణమురళి, జీవా, ప్రవీణ్, బాలచందర్, గౌతమ్ రాజు, చిట్టి బాబు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుర్రా మల్లేష్ గౌడ్ (బొట్టు), శ్రీమతి హారిక జెట్టి, శ్రీమతి పిట్ల విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

అనంతరం దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. కల్లు కాంపౌండ్ టైటిల్ చాలా ఆసక్తిగా ఉంది. కల్లు కాంపౌండ్ వేదికగా చాలా పనులు జరుగుతుంటాయి. ఓ యధార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా సక్సెస్ కావాలని, టెక్నిషియన్స్ కి మంచి పేరు, నిర్మాతలకు డబ్బు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

అతిథి నటుడు రాంకీ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమ పాన్ ఇండియా స్థాయికి వెళ్లడం చాలా గర్వంగా ఉంది. కల్లు కాంపౌండ్ దర్శక నిర్మాతలు కూడా ఐదు భాషల్లో నిర్మించడం చాలా గొప్ప విషయం. వారి గట్స్ కి హ్యాట్సాప్ అన్నారు. చిన్న సినిమాలు హిట్ అవ్వాలి. హిట్టైతే చాలా మంది ముందుకోస్తారని చెప్పారు.

అతిథి దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. కల్లు కాంపౌండ్ సినిమా ట్రైలర్ , సాంగ్స్ చాలా క్వాలిటిగా తీశారు.
కంటెంట్ ఉన్న కథలా అనిపిస్తోంది. దర్శక నిర్మాతల కమిట్ మెంట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… కల్లు కాంపౌండ్ రష్ చూశాక.. చిన్న సినిమా అనే ఫీలింగ్ కలగలేదు. ఓ పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. దర్శకుడు ప్రవీణ్ జెట్టి పనితీరు బాగా ఉంది. ఫస్ట్ డైరెక్షన్ చేసినా.. చాలా క్వాలిటీగా తీశారు. ఈ సినిమా టైటిల్, సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అన్నారు.

చిత్ర హీరో గణేష్ మాట్లాడుతూ.. నేను పుట్టి, పెరిగింది బెంగుళూరు. కన్నడలో చాలా సినిమాలలో నటించాను. సోషల్ మీడియాలో ఆర్టిస్ట్ ల కోసం చూస్తుంటే జస్ట్ ఫార్వర్డ్ చేశాను. కథకు సరిగ్గా సరిపోతానని నమ్మి ఎటువంటి ఆడిషన్ లేకుండా నాతో సినిమా చేశారు దర్శక నిర్మాతలు. సినిమా చాలా బాగా వచ్చింది. 24 క్రాఫ్ట్స్ ఉన్న టెక్నిషియన్స్ సపోర్ట్ వల్ల సినిమాను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసామని అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రవీణ్ జెట్టి మాట్లాడుతూ… కల్లు కాంపౌండ్ 1995 స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలగాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాము. మంచి స్టోరీ చెప్పడమే కాదు. మంచి మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా చెప్పాము. మా సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసి సీనియర్ టెక్నిషియన్స్ మొచ్చుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా టెక్నిషియన్స్ అందరి సపోర్ట్ తో సినిమా సక్సెస్ ఫుల్ గా బెటర్ అవుట్ పుట్ తీసుకోనిరాగలిగాం.. ఇది అన్ని వర్గాలకు నచ్చుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గోన్న ముఖ్య అతిథులు ప్రశాంత్ గౌడ్, విజయకాంత్ , శ్రవణ్ కుమార్ కొమ్మరెడ్డి, నటులు చిట్టిబాబు, పలువురు ప్రముఖలు చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x