Wednesday, January 22, 2025

“నేను మీకు బాగా కావాల్సినవాడిని”: కిరణ్ అబ్బవరం ప్రెస్‌మీట్

రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం, సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో హీరో కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపించనున్నాడు. ఈ మద్యే చిత్ర ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ఫాదర్ గా దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి గారు నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న గ్రాండ్ గా ఇండియా వైడ్ గా 550 పైచిలుకు థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర హీరో కిరణ్ అబ్బవరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను. ఆయనతో పనిచేసే అవకాశం దొరకకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్‌ ను పవన్ అన్న లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌. మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్ కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాను చూసిన వారందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్ కు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఇదే అవుతుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. హీరోయిన్ కు కూడా మంచి ప్రాదాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది.

దర్శకుడు శ్రీధర్ నా కాంబినేషన్ లో సినిమా చేయడానికి కొంతమంది ప్రయత్నించినప్పటికీ కోడి దివ్య గారి బ్యానర్ లో ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను. ఇందులో నాది బాబా భాస్కర్ ల ట్రాక్ చాలా బాగుంటుంది.

నిర్మాత కోడి దివ్య దీప్తి సహకారం వల్లే ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చిన పాటలు, ఆర్ ఆర్ అద్భుతంగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.

గీతా ఆర్ట్స్ లో ‘వినరో విష్ణు భాగ్యం’, మైత్రి మూవీ మేకర్స్ లో ‘మీటర్’ ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొన్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40% షూటింగ్ అయ్యింది. ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x