తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు మరియు విలక్షన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘నేనే వస్తున్నా’ చిత్రాన్ని చేసిన విషయం విదితమే. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటూ, విడుదలకు సిద్దమవుతుంది.
“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటించారు.
కలై పులి ఎస్ తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ. ‘నానే వరువేన్’ చిత్రం తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ ప్రెసెంట్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించింది. ఈ సంధర్బంగా కలై పులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ ను కలిసారు. ‘నేనే వస్తున్నా’ చిత్రం సెప్టెంబర్ నెలలోనే విడుదలకానుంది.
నటీనటులు:
ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు