పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు
సత్య ధనేకుల దర్శకత్వంలో వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ 'మిస్ కాళికా మిస్సింగ్' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జె ఎస్ వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఎస్ ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ కాళికా మిస్సింగ్’. సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రామకృష్ణ, యమున మాట్లాడుతూ.. “మా చిత్రం పూర్తి సస్పెన్స్‌తో సాగే ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. మునుపెన్నడూ చూడని కథనంతో ఈ మూవీ చిత్రీకరణ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈ చిత్రం డెఫినెట్‌గా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము” అని అన్నారు.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా వినీత్ చంద్ర, డాలీషా నటించగా.. ఎస్తేర్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, ఆలీ, జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
సాంకేతిక వర్గం:
- బ్యానర్లు: జె ఎస్ వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- ఛాయాగ్రహణం: శివ దేవరకొండ
- సంగీతం: లీండర్ లీ మార్టీ
- పి ఆర్ ఓ: వీరబాబు
- నిర్మాతలు: రామకృష్ణ, పదిమల యమున
- దర్శకత్వం: సత్య ధనేకుల




.jpg)
