రెగ్యులర్ స్టోరీ లా కాకుండా డిఫరెంట్ కథతో వస్తున్న ఈ సినిమా లో భగవద్గీత, బైబిల్ ఖురాన్ లలో అందమైన, పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతే అందమైన పవిత్రమైన ప్రేమను చూయించడం జరిగింది అన్నారు చిత్ర దర్శకులు వెంకట్ వందెల. జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై హుషారు లాంటి సూపర్‌హిట్ చిత్రం లో నటించిన తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వం లో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు 19 న విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకులు సాగర్, దర్శకులు సముద్ర, వేణుగోపాల్ చారి, వడ్ల పట్ల మోహన్, నిర్మాత పద్మిని నాగులపల్లి, డా. యం. ఆర్. సి. చౌదరి, నటుడు మాణిక్, సహారా గ్రూప్ తస్కిన్ లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రోమో సాంగ్ చూస్తుంటే వర్షం లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ‘నువ్వు వస్తానంటే నే వంద్దంటానా’ సినిమాల్లో పాట గుర్తుకు వస్తుంది. ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు..
అతిధిగా వచ్చిన వడ్లపట్ల మోహన్ మాట్లాడుతూ.. రెగ్యులర్ స్టోరీ లకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న దర్శక, నిర్మాతలకు ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి. ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు అన్నీ బాగున్నాయి అన్నారు
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట్ చెప్పిన పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చాను.ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు..ప్రేమ కథ తో పాటు వినొదాన్ని మిక్స్ చేసి తెరక్కించిన ఈ చిత్రం లో యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు అన్ని వుంటాయి.ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా ఇది మ్యూజికల్ ఎంటర్‌టైనర్ గా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఆగష్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు
చిత్ర దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ టైటిల్ పెద్దగా ఉండచ్చు కానీ మీ పెద్ద మనసుకు ఇది చిన్న టైటిల్ అనుకుంటాను. కథకు తగ్గ టైటిల్ పెట్టాము. నాకు ఇలాంటి మంచి కథకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. ఇందులో హీరో హీరోయిన్స్ ఇద్దరూ చాలా చక్కగా నటించారు. సినిమా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. అందరూ ఈ కథ అమ్మాయి పాయింట్ అఫ్ వ్యూ లో ఉంటుంది అనుకుంటారు కానీ ఇది హీరో పాయింట్ అఫ్ వ్యూ లో ఉంటుంది. రావణాసురుడికి తన భార్య మండోదరి పై ఉన్న ప్రేమ , రాముడికి సీత పై ఉన్న ప్రేమ , దశరథుడుకు తన కొడుకు మీద నమ్మకం ఇలా ప్రతి ఒక్కరిది అందమైన ప్రేమ. భగవద్గీత, బైబిల్ ఖురాన్ లలో అందమైన, పవిత్ర మైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతే అందమైన పవిత్రమైన ప్రేమను చూయించడం జరిగింది.లవ్ స్టోరీస్ అంటే అమ్మాయి వెంట అబ్బాయి, లేకపోతె అబ్బాయి వెంట అమ్మాయి పడి లవ్ చేసేలా కాకుండా ఈ సినిమా రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుంది సందీప్ గారు అద్భుత మైన మ్యూజిక్ ఇచ్చారు. ఆగష్టు 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన పెద్దలందరికి ధన్యవాదములు. ఈ చిత్రాన్ని ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము. ఇందులో నటించిన హీరో, హీరోయిన్ లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గారికి ఇలా అందరూ బాగా నటించడమే కాకుండా వారంతా సపోర్ట్ చేయడం వలెనే సినిమా బాగా వచ్చింది. టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. అందరికీ నా ధన్యవాదములు.. నన్ను నిర్మాతగా పరిచయం చేసిన మా తల్లి తండ్రులు ముల్లేటి నాగేశ్వరావు, ముల్లేటి జానకి గార్లకు ధన్యవాదములు అన్నారు.
హీరో తేజ్ కూరపాటి మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న నా వెంట పడుతున్న చిన్న వాడెవడమ్మా సినిమా ఆగష్టు 19 న విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరోయిన్ అఖిల ఆకర్షణ మాట్లాడుతూ.. ఇప్పుడొచ్చే సినిమాలకు భిన్నంగా ఉన్న “నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా ” సినిమాను అందరూ ఆదరించాలి అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇందులో ఉన్న ఐదు పాటలు కూడా ఐదు వేరేషన్ లో చాలా డిఫరెంట్ ఉంటాయి.ఈ పాటలన్నీ నాకు మంచి పేరు తీసుకువస్తాయి అన్నారు
నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. యూత్ కు అట్రాక్ట్ అయ్యే సినిమాలు ఎన్ని వస్తున్నా పల్లెటూరు సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ పాట చూస్తుంటే సంక్రాంతి పండుగ వచ్చునట్టు అనిపిస్తుంది అన్నారు
డా. యం. ఆర్. సి. చౌదరి మాట్లాడుతూ..నాగేశ్వరావు గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. తనకు హెల్త్ బాగాలేక లేకపోయినా సినిమా కొరకు తను పడే తపన నాకెంతో నచ్చింది.అందుకే తనకు అండగా నిలబడాలని ఈ సినిమాకు నేను సపోర్ట్ గా నిలవడం జరిగింది.ఇలా సినిమా కొరకు తపన పడే నిర్మాత దర్శకుడుకి దొరకడం అదృష్టం. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి ఎంతో అవసరం. వీరి ద్వారా అనేక మందిని నటీనటులు టెక్నిషియన్స్ చిత్ర పరిశ్రమకు పరిచయ మవుతారని అన్నారు
నటుడు మాణిక్యం మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ తో నిర్మాత ఇంకా అనేకమైన సినిమాలు తీసి గొప్ప నిర్మాత అవ్వాలి అన్నారు.
సహారా గ్రూప్ తస్కిన్ మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్, వేణుగోపాల్ చారి లతో పాటు పాల్గొన్న వారందరూ ఆగష్టు 19 న విడుదల అవుతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు
నటీనటులు
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ , తణికెళ్ళ భరణి, కల్పనా రెడ్డి, జీవా, జొగి బ్రదర్స్, అనంత్, బస్టాప్ కోటేశ్వరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు