Thursday, November 21, 2024

‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ లోని జనగణ మన పాట లేజర్ షో తో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకుడు జాగర్లమూడి క్రిష్, దర్శకుడు సురేందర్ రెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, దర్శకులు సాగర్ చంద్ర, మైత్రీ మూవీస్ నిర్మాత రవి శంకర్ నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత బండ్ల గణేష్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ రామ్ తాళ్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగ వంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు. వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వే గేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

డీఐజీ సుమతి మాట్లాడుతూ.. ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ గా మీ ముందు ఉండటం, వకీల్ సాబ్ లాంటి సినిమా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఒక స్త్రీని అమ్మగా ఊహించుకున్నప్పుడు ఏ రకమైన ఇజాన్ని ఆపాదించం, ఒక చెల్లిగానో, అక్కగానో చూసినప్పుడు కూడా తప్పుగా అనుకోం, అలాగే వివిధ రంగాల్లో ఉన్న యువతులను, వాళ్లు ఏదో సాధించారు అనే అభిప్రాయంతో గొప్పగా చూస్తారు. కానీ ఏమీ లేకుండా ఒక మహిళను మహిళలా చూడాలి. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఈ దేశంలో క్రియేట్ చేయబడిన చట్టాలన్నీ మేల్ తో తయారు చేశారు మేల్ కోసం. మహిళ, పురుషులు ఎవరికైనా మూస ప్రవర్తన ఉండకూడదు. మీరు వర్జినా అని అడుగుతారా, మేల్ ను అడిగినప్పుడు అంతా అబ్జక్షన్ చెబుతారు. అదీ మేల్ కున్న అడ్వాంటేజ్. వకీల్ సాబ్ లాంటి మూవీ తప్పకుండా మార్పు తీసుకొస్తుంది. అలాంటి మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నన్ను ఇక్కడికి పిలిచి సత్కరించిన వాళ్లకు థాంక్స్. తెలుగు ప్రేక్షకురాలిగా నేనూ వకీల్ సాబ్ విజయాన్ని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ నందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా అంటారు. లంచ్ టైమ్ లో షూటింగ్ జరుగుతుంది. ట్విట్టర్ ఓపెన్ చేశాను ఏం న్యూస్ వచ్చిందని, అందులో ఒక మెసేజ్ అభిమాని పంపింది ఉంది. అందులో ఎండ బాగుంది, మా హీరోను బాగా చూసుకోండి అని పంపారు. మనకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఫెస్టివల్ మొదలవబోతోంది. అందులో వకీల్ సాబ్ శుభారంభం చేయబోతోంది. ఇలాంటి గొప్ప ఇతివృత్తమున్న చిత్రాన్ని పవన్ గారి దగ్గరకు తీసుకెళ్లిన నిర్మాత దిల్ రాజు గారికి శతకోటి వందనాలు. ఇది చెప్పాల్సిన కథ. ఇందుకు సెన్సబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణును తీసుకోవడం మరో మంచి డెసిషన్. పవన్ గారు తనకున్న సుప్రీమ్ పవర్ స్టార్ అయినా, తనకన్నా ఇతర పాత్రలకు కథలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా, తనకున్న ఇమేజ్ పక్కన పెట్టి ఇది నేను చేయాల్సిన సినిమా అని వకీల్ సాబ్ మన ముందుకు తెచ్చిన పవర్ స్టార్ గారికి ఓయ్ వేసుకోండి. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ కోరుతున్నా. అన్నారు.

నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. ఇది కరోనా టైమ్ మీరంతా జాగ్రత్తగా ఉండాలి. రేపు థియేటర్లలో వకీల్ సాబ్ సినిమా చూసేందుకు విపరీతంగా జనం రాబోతున్నారు. అందుకే ప్రికాషన్ గా చెబుతున్నాను. పవన్ గారితో గతంలో ఖుషీ, బంగారం చేశాను. ఇప్పుడు మూడో చిత్రం వీరమల్లు చేస్తున్నాను. ఆయన హీరోగానే కాకుండా ఒక వ్యక్తిగా పవన్ గారంటే నాకు చాలా ఇష్టం. పవన్ గారిది చాలా సున్నితమైన మనసు, ఎవరికి ఏదైనా అయితే తట్టుకోలేరు. అంత గొప్ప వ్యక్తి. పవన్ గారు పాలిటిక్స్ లోకి వెళ్లాక తిరిగి చేస్తున్న చిత్రమిది. పవర్ స్టార్ చేస్తున్న సినిమాలన్నీ ప్రజా సేవ కోసమే. ప్రస్తుతం సౌత్ లో ఏ స్టార్ హీరో అయినా సంవత్సరానికి ఒకటే సినిమా చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. సినిమాల కోసం ఇక్కడా ఉంటున్నారు, ప్రజల కోసం ఏపీకి వెళ్తున్నారు. రోజుకు కొన్ని గంటలు కూడా నిద్రపోవడం లేదు. పవన్ గారికి రాబోయే అతి ముఖ్యమైన సినిమాల్లో వకీల్ సాబ్ ప్రధానమైంది. రాజకీయాల్లోకి వెళ్లక ముందు పవన్ గారి ఇమేజ్ వేరు, వెళ్లాక ఇమేజ్ వేరు. ప్రజా సమస్యల మీద పోరాడే పవన్ గారు…ఈ వకీల్ సాబ్ చిత్రంలో ఓ స్త్రీకి జరిగిన అన్యాయంపై న్యాయపరమైన పోరాటం చేశారు. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఖుషీ, గబ్బర్ సింగ్ లాంటి పవన్ గారి హిట్స్ అన్నీ రీమేక్ లే. వకీల్ సాబ్ పింక్ రీమేక్ .. ఈ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుంది. పవన్ గారు రీమేక్ చేస్తే అది రీమేక్ లా ఉండదు. తనకు తగినట్లు మల్చుకుంటారు. పవర్ స్టార్ తో సినిమా చేయాలన్న దిల్ రాజు గారి కల ఈ చిత్రంతో తీరింది. దిల్ రాజు గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇది అన్నింటికన్నా పెద్ద హిట్ కావాలి. అన్నారు.

కస్తుర్బా గాంధీ స్మారక జాతీయ సంస్థ తెలంగాణ ప్రతినిధి, విద్యావేత్త పద్మావతి మాట్లాడుతూ.. నేను మరో ప్రపంచంలో ఉన్నానని అనిపిస్తోంది. నేను సినిమాలు చూసి చాలా కాలమవుతోంది. హిందీలో అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా చూశాను. అలాంటి మంచి సందేశాత్మక చిత్రాలు మన దగ్గర ఎందుకు తీయరు అనిపించేది. ఈ వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించిన నిర్మాత, దర్శకుడు, నటీనటులు అందరికీ అభినందనలు. ఎందుకంటే ఇవాళ్టి సమాజానికి కావాల్సిన చిత్రమిది. ఆడవాళ్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను కళ్లారా చూశాను. వేల సభలు పెట్టి మేము చెబితే వినని యువత, ఒక పవర్ ఉన్నటువంటి పవర్ స్టార్ చెబితే తప్పకుండా వింటారు అనే నమ్మకం ఉంది. పవర్ స్టార్ కు పవర్ ఫుల్ విజయాన్ని అందిస్తే అదే మీలో వచ్చిన మార్పునకు ఉదాహరణ అనుకుంటాను. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు దిల్ ఉన్నటువంటి దిల్ రాజు గారు నిర్మించాలని కోరుకుంటూ. ఇవాళ ఇక్కడికి పిల్చి నాకు సత్కరించడం ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలగజేసింది. అన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక బిగ్ ఫిల్మ్ థియేటర్లో చూసి వన్ ఇయర్ అవుతోంది. ఏప్రిల్ 9న అభిమానుల కేకలు అరుపుల మధ్య సినిమా చూసేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇస్తున్న నిర్మాత దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థాంక్స్. ఏప్రిల్ 9న పవర్ స్టార్ రియల్ పవర్ ఏంటో చూడబోతున్నాం. అన్నారు.

నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. నేను నిర్మాత దిల్ రాజు గారికి ఆల్ ద బెస్ట్ కాకుండా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా తెలిసిపోయింది వకీల్ సాబ్ పెద్ద హిట్ అని. సో టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. అన్నారు.

దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు హలో. పవన్ గారి చాలా సినిమా కార్యక్రమాల్లో మీ ప్లేస్ లో ఉండి కార్యక్రమాలను ఎంజాయ్ చేశాను. ఇవాళ వేదిక మీద ఉండటం గర్వంగా ఉంది. నన్ను ఇక్కడికి పిల్చిన దిల్ రాజు గారికి, శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. ఒక మంచి పర్పస్ ఫుల్ ఫిలిం తీశారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉండటం గొప్ప విషయం. ఏప్రిల్ 9న థియేటర్లలో ఒక విజువల్ ఫీస్ట్ కనిపించబోతోంది. విజువల్ ఫీస్ట్ విత్ పర్పస్ ఫుల్ ఫిల్మ్ విత్ పవర్ స్టార్. వకీల్ సాబ్ ను పెద్ద హిట్ చేయండి. థాంక్యూ. అన్నారు.

సాహస బాలిక రుచిత మాట్లాడుతూ.. మా స్కూల్ బస్ ట్రాక్ మీద ఆగిపోయింది. డ్రైవర్ అంకుల్ కు చెప్పాము ముందుకు వెళ్లండి అన్నారు. ఆయన వినిపించుకోలేదు. నాకు చేతనైనంత మందిని కాపాడాలని ఒక ఇద్దర్ని కిటికీ లోనుంచి బయటకు పడేశాను. వాళ్లు క్షేమంగా బయటపడ్డారు. నేను దూకుదామని ప్రయత్నించేసరికి ప్రమాదం జరిగిపోయింది. అప్పటి వరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయాను. ఆస్పత్రిలో మెలకువ వచ్చింది. నేను ఇక్కడికి ఈ వేదిక పైకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన మూవీ కార్యక్రమానికి వస్తానని అనుకోలేదు. ఏప్రిల్ 9న అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అని చెప్పింది.

నటుడు మీర్ మాట్లాడుతూ.. ప్రతి మనిషి జీవితంలో ఏడు అద్భుతాలు ఉంటాయి. దానికి మించిన అద్భుతాలు ఆ మనిషి పూర్వ జన్మలో చేసిన మంచి పనుల వల్ల కలుగుతుంది. నా జీవితంలో గుర్తుండిపోయే ఒక అద్భుతం వకీల్ సాబ్ సినిమా. నేను ఈ సినిమా చేయాలని అనుకున్నది దర్శకుడు శ్రీరామ్ వేణు గారు. ఆయన నాకు ఎంసీఏ సినిమాలోనూ అవకాశం ఇచ్చారు. వకీల్ సాబ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా నాకు గొప్ప అనుభవం. పవర్ స్టార్ గారి ఎనర్జిటిక్ ఫర్మార్మెన్స్, ప్రకాష్ రాజ్ గారి ఎక్సీపిరియన్స్ యాక్టింగ్, నివేదా థామస్ సెటిల్డ్ ఫర్మార్మెన్స్ ఇవన్నీ నేను ప్రత్యక్షంగా సెట్ లో చూడగలిగాను. ఇదంతా నాకు గొప్ప అనుభవం. ఇంత మంచి అనుభూతిని అందించిన నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. వకీల్ సాబ్ దిగ్విజయం సాధించాలి. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x