కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్, మాస్, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు నేడు(మే23). ఈ రోజున దర్శకేంద్రుడి పర్యవేక్షణలో రూపొందుతోన్న`పెళ్లి సందD` చిత్రంలోని రెండవపాట ‘బుజ్జులు బుజ్జులు…’ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసందD`. గౌరి రోణంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
‘‘పాలకుండ నెత్తినెట్టి పంజగుట్ట పోతవుంటే
బోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు
రాయి పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు
కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు
చిల్లుపడ్డ కుండతో ఇంటికెట్ట పోనురా పోరడా..నీ మద కోపమొచ్చెరా
నీ బుంగ మూతి చూడనేకి రాయి పెట్టి కొట్టినా
కంటి ఎరుపు సూడనేకి కుండ పగల గొట్టినా
అలక నీది సూడనేకి అల్లరెంతో జేసినా
బుజ్జులు బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు…’’ పాట వింటే ప్రేయసి ప్రేమికుడు ఏడిపించడం..మళ్లీ ఆమె అలక తీర్చడానికి ఆమెకు ఇష్టమైనవన్నీ కొని పెడతానని అనడం.. పాట ఇలా సాగుతుంది.
ఈ సందర్భంగా దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ – ‘‘శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావుగారి పర్యవేక్షణలో నేను డైరెక్ట్ చేస్తోన్న ‘పెళ్లిసందD’ సినిమా నుంచి బుజ్జులు పాటను దర్శకేంద్రుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వస్తోంది. అలాగే రాఘవేంద్రరావుగారు మరియు కీరవాణిగారి సూపర్ హిట్ కాంభినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్రతి పాట తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇటీవల విడుదలై మెప్పించిన తొలిసాంగ్‌లాగానే బుజ్జులు సాంగ్ కూడా మెప్పిస్తుంది. ’’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా పాటను అభిమానులకు అందించడ హ్యపీ. రాఘవేంద్రరావు, కీరవాణి కాంబోలో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అదే కోవలో ఇది కూడా నిలుస్తుంది. సినిమా విషయానికి వస్తే..ఏడు రోజులు ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. లాక్‌డౌన్ తీసేశాక బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి జూన్, జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు
సాంకేతిక వర్గం:
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్
సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
మాటలు: శ్రీధర్ సీపాన
ఫైట్స్: వెంకట్
కొరియోగ్రఫి: శేఖర్ వీజే
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వి. మోహన్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి
సమర్పణ: కె. కృష్ణమోహన్ రావు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ
దర్శకత్వం: గౌరీ రోణంకి.