Wednesday, December 25, 2024

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “బాబు జగజ్జీవన్ రామ్” సినిమా

స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న సినిమా బాబు జగజ్జీవన్ రామ్. ఈ చిత్రాన్ని పెదరావూరు ఫిలిం స్టూడియోస్, తెనాలి బ్యానర్ పై దర్శకుడు దిలీప్ రాజా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబు జగజ్జీవన్ రామ్ పాత్రలో మిలటరీ ప్రసాద్ నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర షూటింగ్ విశేషాలను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం వివరించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ సేవల గురించి ప్రేక్షకులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి అయిన జూలై 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రంలో బాబు జగజ్జీవన్ రామ్ పాత్రలో మిలటరీ ప్రసాద్ నటిస్తున్నారు. 40 ఏళ్లు కేంద్రమంత్రిగా, 50 ఏళ్లు పార్లమెంటేరియన్ గా దేశానికి సేవలు అందించి చరిత్ర సృష్టించారు బాబు జగజ్జీవన్ రామ్. ఈ చిత్రాన్ని డాక్యుమెంటరీలా కాకుండా ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నాం. గాంధీజీ, నేతాజీ, లాల్ బహదూర్ శాస్త్రి, చంద్రశేఖర్ ఆజాద్ పాత్రలు ఉంటాయి. జగజ్జీవన్ రామ్ కుమార్తె లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాత్రలో తాళ్లూరి రామేశ్వరి నటిస్తున్నారు. పీరియాడిక్ మూవీ కాబట్టి చిత్రీకరణకు కొంత సమయం ఎక్కువగానే తీసుకున్నా మంచి క్వాలిటీతో మూవీ చేస్తున్నాం. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రాన్ని రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నటుడు మిలటరీ ప్రసాద్ మాట్లాడుతూ… బాబు జగజ్జీవన్ రామ్ పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ దిలీప్ రాజా గారికి థ్యాంక్స్. బాబు జగజ్జీవన్ రామ్ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన జాతీయ నాయకుడు. ఆయన గొప్పదనాన్ని ఈ మూవీ ద్వారా మనకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్ దిలీప్ రాజా గారికి అభినందనలు తెలియజేస్తున్నా. అన్నారు.

నటి మౌనిక రెడ్డి మాట్లాడుతూ… బాబు జగజ్జీవన్ రామ్ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి అరుదైన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఎప్పటికీ గుర్తిండిపోయేలా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రాన్ని మా డైరెక్టర్ దిలీప్ రాజా గారు రూపొందిస్తున్నారు. అన్నారు.

నటుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ… బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రకు వెండితెర రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్ దిలీప్ రాజాను ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఈ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మన దేశానికి సేవ చేసిన ఒక గొప్ప నాయకుడి జీవితాన్ని తెరపై చూడబోతున్నాం. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x