Wednesday, January 22, 2025

మా అమ్మకు గర్వంగా వకీల్ సాబ్ చూపిస్తా: థమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ లోని జనగణ మన పాట లేజర్ షో తో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకుడు జాగర్లమూడి క్రిష్, దర్శకుడు సురేందర్ రెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, దర్శకులు సాగర్ చంద్ర, మైత్రీ మూవీస్ నిర్మాత రవి శంకర్ నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత బండ్ల గణేష్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ రామ్ తాళ్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగ వంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు. వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వే గేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి గొప్ప సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు గారికి థాంక్స్. ఇది 126 సినిమాల వెయిటింగ్, 20 ఏళ్లు వేచి చూసిన కల. నాకు వకీల్ సాబ్ రెండున్నర గంటల సినిమా సరిపోలేదు మ్యూజిక్ చేసేందుకు. ఇంకా కోరిక అలాగే ఉంది. నా రాత మార్చిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా నాకే ఇప్పించారు. అందులో మాస్ పాటలు చేస్తానని మాటిస్తున్నా. మా అమ్మను తీసుకెళ్లి గర్వంగా చూపించే సినిమా వకీల్ సాబ్. పవన్ గారి మీద నాకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ, కసి, ఎమోషన్ అంతా కీబోర్డ్ మీద చూపిస్తాను. నేను నా టీమ్ అంతా గత 36 రోజులుగా సరిగ్గా నిద్రపోకుండా పనిచేస్తున్నాము. ఏప్రిల్ 9న మీరంతా సినిమా చూడాలనేది నా కోరిక. మీరు తప్పకుండా వకీల్ సాబ్ సినిమా చూడాలి. థియేటర్లో మీరు రెప్పవాల్చకుండా సినిమా చూస్తారనే హామీ ఇస్తున్నా. వకీల్ సాబ్ సినిమాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. ఇందులో మగువా మగువా లాంటి పాట, కదులు కదులు, సత్యమేవ జయతే లాంటి పాటలు హృదయాన్ని కదిలిస్తాయి. పాలిటిక్స్ లో వచ్చేప్పుడు పవన్ గారు ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ నాకింకా గుర్తుంది. ఆ స్పీచ్ స్ఫూర్తితోనే సత్యమేవ జయతే పాట కంపోజ్ చేశాం. ఇందులో కెవ్వు కేక లాంటి మాస్ పాటలు ఉండవా అని అడుగుతున్నారు. ఆ పాటలు చేయాలంటే రాత్రి కంపోజ్ చేస్తే తెల్లారికి రికార్డ్ అవుతాయి. కానీ ఇలాంటి పాటలు మనసుతో చేయాలి. వకీల్ సాబ్ సిగరెట్ల్ వెలిగించుకునే సినిమా కాదు ఇంట్లో దీపాలు వెలిగించే సినిమా. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు ఆయనకు థాంక్స్. అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x