షేన్ వార్న్ కెప్టెన్సీలో తొలి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత ఒక్క సారి కూడా టైటిల్ ను ముద్దాడలేదు. ఇక గత సీజన్‌లో కూడా రాజస్థాన్ జట్టుగా పూర్తిగా విఫలమైంది. కానీ సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్లు తమదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుత కష్టకాలంలో రాయల్స్ కెప్టెన్‌గా ఎంపికైన శాంసన్ అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాడు. ఆటగాళ్లను సమన్వయం చేస్తూ, ఆటగాళ్లందరినీ గొప్పగా ముందుకు నడిపించడమే అతడి ముందున్న అతిపెద్ద సవాల్. బెన్ స్టోక్స్, బట్లర్, ఆర్చర్ లాంటి ఆటగాళ్లను నడిపించడం సాధారణ విషయం కాదు. ఈ క్రమంలోనే మరో వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్ గురించి సంజూ తాజాగా మీడియాతో మాట్లాడాడు.
‘రాజస్తాన్ రాయల్స్‌ను కెప్టెన్‌గా ముందుకు నడిపించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలనే దానిపై మనుసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టడం సవాళ్ళతో కూడుకున్న పని. అయినా వెనక్కి తగ్గిను. ముఖ్యంగా కొత్త బాధ్యతలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. నిజాయితీగా చెప్పాలంటే రాయల్స్‌కు కెప్టెన్ అవుతానని గతేడాది చివరి వరకు నేను అస్సలు ఊహించలేదు. మా జట్టు మేనేజర్ మనోజ్ బాద్లే నా దగ్గరకు వచ్చి.. ‘నీ మీద మాకు నమ్మకం ఉంది. కెప్టెన్‌గా పనిచేసేందుకు రెడీగా ఉండమ’ని చెప్పాడు.
ఇదిలా ఉంటే సంజూకు కెప్టెన్సీ ఇవ్వడంతో పాటు, రాజస్థాన్ ఫ్రాంచైజీ కోచ్, డైరెక్టర్లను కూడా మార్చింది. కొత్త డైరెక్టర్, కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే కోచ్ గురించి సంజూ స్పందిస్తూ.. కుమార సంగక్కర గొప్ప ఆటగాడాని, అతడితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానాని, అతడి అపార అనుభవం జట్టును మరింత పటిష్ఠం చేస్తుందని పేర్కొన్నాడు. ‘అంతర్జాతీయ వికెట్ కీపర్‌గా శ్రీలంకకు సేవలు అందించిన సంగక్కర లాంటి లెజెండ్‌తో కలిసి పనిచేయడం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా. అతడి దగ్గర కెప్టెన్సీ లక్షణాలతో పాటు.. వికెట్ కీపింగ్‌లోని మరిన్ని మెళుకువలు నేర్చుకునే అవకాశం దొక్కింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 12న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.