అక్టోబర్ 2న 'తత్వం'.. దినేష్ తేజ్, దశ్విక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్'Tatvam' Hits Theatres October 2: Dinesh Tej, Dashvika's Murder Mystery Thriller
దినేష్ తేజ్, దశ్విక కె. జంటగా అర్జున్ కోలా దర్శకత్వంలో రూపొందిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'తత్వం' అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.'Tatvam', a murder mystery investigation thriller starring Dinesh Tej and Dashvika K. and directed by Arjun Kola, releases in theatres on October 2. The team met the media ahead of release.
దినేష్ తేజ్ హీరోగా, దశ్విక కె. హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తత్వం’. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్ బ్యానర్లపై వంశీ సీమకుర్తి, శ్వేత పశుపులేటి నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ కోలా దర్శకత్వం వహించారు. సమాజంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో దశ్విక తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.
విడుదల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దినేష్ తేజ్ మాట్లాడుతూ, ‘తత్వం’ తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నానని చెప్పారు. బలమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది అని, ప్రమోషన్స్ సమయంలో జరిగిన ప్రమాదం తనకు రెండో జీవితం లాంటిదని భావోద్వేగంగా అన్నారు. యాక్షన్ సన్నివేశాల సమయంలో దినేష్ తేజ్ ఎంతో సపోర్ట్ చేశారని, దర్శకుడు అర్జున్ కోలాకు కథపై పూర్తి స్పష్టత ఉందని దశ్విక చెప్పారు. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే ఈ సినిమాను పూర్తి చేశానని, ఎన్నో అనుకోని అడ్డంకులను దాటుకుని విడుదల వరకు వచ్చామని దర్శకుడు అర్జున్ కోలా తెలిపారు. కథలోని ట్విస్టులు ప్రేక్షకులను నిజంగా ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. కొత్త ఆలోచనలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహించాలని సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ కోరారు. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తే నిర్మాణ సమయంలో పడిన కష్టాలన్నీ మరిచిపోతామని నిర్మాతలు వంశీ సీమకుర్తి, శ్వేత పశుపులేటి అన్నారు.
సాంకేతిక వర్గం:
- దర్శకత్వం: అర్జున్ కోలా
- నిర్మాతలు: వంశీ సీమకుర్తి, శ్వేత పశుపులేటి
- బ్యానర్లు: త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్
- సంగీతం: చేతన్ భరద్వాజ్
- ఎడిటర్: విప్లవ్ నైషధం
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రొంగలి
‘Tatvam’ stars Dinesh Tej and Dashvika K. in the lead roles. Produced by Vamsi Seemakurthi and Swetha Pashupulate under the Trayathi Ishani Creations and S.K. Productions banners, and directed by Arjun Kola, the murder mystery investigation thriller is inspired by real incidents in society and releases in theatres on October 2. The film marks Dashvika’s Telugu debut.
Speaking at the press meet ahead of release, Dinesh Tej said he believes ‘Tatvam’ will be a turning point in his career. Calling it a film backed by powerful content, he said the accident he met with during promotions felt like a second chance at life. Dashvika said Dinesh Tej was very supportive, especially during the action sequences, and appreciated director Arjun Kola’s clarity and commitment. She said she is confident audiences will enjoy the film.
Director Arjun Kola said he made the film while working a software job in Bengaluru, and that the team overcame several unexpected setbacks to reach the release stage. He promised the twists will genuinely surprise audiences. Music director Chetan Bharadwaj urged audiences to encourage films driven by fresh ideas, while producers Vamsi Seemakurthi and Swetha Pashupulate said the hardships of production would be forgotten once audiences embrace the film.
Technical Crew:
- Director: Arjun Kola
- Producers: Vamsi Seemakurthi, Swetha Pashupulate
- Banners: Trayathi Ishani Creations, S.K. Productions
- Music: Chetan Bharadwaj
- Editor: Viplav Naishadam
- Executive Producer: Bharat Rongali
సినిమా విభాగంలో మరిన్నిMore in Cinema

'వీల్' ట్రైలర్ లాంచ్.. సస్పెన్స్, యాక్షన్, రొమాన్స్‌తో నాగేంద్ర అవుల చిత్రం'Veil' Trailer Launched: Nagendra Avula's Suspense Thriller Packs Action, Romance and Twists

13 ఏళ్ల 'మనం సైతం'.. అనాథలు, వృద్ధుల కోసం కాదంబరి కిరణ్ 'సపర్య'Manam Saitham at 13: Kadambari Kiran Launches 'Saparya' for Orphans and the Elderly



