కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ నెఫ్రాలజీ వైద్యులు, గచ్చిబౌలి బ్రాంచ్ లోని ఒమేగా హాస్పిటల్ హెడ్ ఆఫ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్. అరుణ్ కుమార్ తెలిపారు. నెఫ్రాలజీ రంగంలో ఉత్తమ సేవలను అందించినందుకు గాను డిసెంబర్ 12న బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ గా వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ అచీవర్స్ అవార్డును కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖా ల మంత్రి ఎస్ పి సింగ్ బాగేల్ చేతుల మీద అందుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన సన్నిహితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని నెఫ్రో ప్లస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ తో కలిసి మాట్లాడారు.
కిడ్నీ సమస్యలపై సరైన అవగాహన లేక అనేక మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. కిడ్నీ సమస్యలను సరైన సమయంలో గుర్తించడం ద్వారా వాటిని అరికట్టవచ్చునని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవయవ మార్పిడి కి సహకరిస్తున్న ఎన్జీవోస్ కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో మరింత ఎక్కువస్థాయిలో ప్రజాసేవకు కృషి చేస్తానని తెలిపారు.
వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ అచీవర్స్ తెలంగాణకు రావడం గర్వకారణం – బేబీ సినిమా ఫేం వీరాజ్ అశ్విన్
బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ గా వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ అచీవర్స్ అవార్డు తెలంగాణ వైద్యునికి రావడం గర్వకారణం అని బేబీ సినిమా ఫేం వీరాజ్ అశ్విన్ అన్నారు. డాక్టర్ అరుణ్ కుమార్ అందించిన సేవలను గుర్తించి వరల్డ్ వైడ్ హెల్త్‌కేర్ సంస్థ అవార్డును ప్రధానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.