Wednesday, January 22, 2025

మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘యాధ్గిరి & సన్స్’

శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సంద్భంగా చిత్ర దర్శకుడు బిక్షపతి రాజు పందిరి మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న చిత్రం. ఈ చిత్రంలో నటీనటుల పాత్రలు చాలా క్యాజువల్‌గా, నాచురల్‌గా ఉంటాయి. ఈ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులైన జీవా, రాజీవ్ కనకాల యాక్టింగ్ అద్భుతంగా వుంటుంది. మార్తాండ్. కె. వెంకటేష్‌గారి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. అన్ని హంగులతో యాధ్గిరి & సన్స్ చిత్రాన్ని మే 5న రిలీజ్ చేయనున్నాము. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు.

అనిరుధ్, యశస్విని, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: విజయ్ కురాకుల,
డి.ఓ.పి: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
పి.ఆర్.ఓ: బి. వీరబాబు
కో డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు,
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బిక్షపతి రాజు పందిరి

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x