Wednesday, January 22, 2025

ఎన్‌కె ప్రొడక్షన్స్ వారి ‘బనారస్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. తాజగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది. కన్నడ స్టార్ రవిచంద్రన్, బాలీవుడ్ స్టార్ అర్బాజ్ ఖాన్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

‘‘నా పేరు సిద్ధు. నేనొక ఆస్ట్రోనాట్. ఐయామ్ ఎ టైమ్, ట్రావెలర్ అండ్ ఐ హేవ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్’’ అని హీరో జైద్ ఖాన్ వాయిస్ తో మొదలైన ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రారంభంలో బనారస్ విజువల్స్ ని చూపించిన తర్వాత జైద్ ఖాన్ స్టయిలీష్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య ప్రేమ సన్నివేషాలు బ్యూటీఫుల్ గా వున్నాయి. హీరోయిన్ కి హీరో ‘‘నేను నీ ఫ్యచర్ భర్త’’ని చెప్పడం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ సెకండ్ హాఫ్ లో టైం ట్రావెల్ ఎలిమెంట్ ని పరిచయం చేసిన తర్వాత ఎక్సయిటింగ్ సన్నివేశాలు థ్రిల్ చేశాయి. దిని తర్వాత వచ్చిన యాక్షన్ సీన్స్ బ్రిలియంట్ గా వున్నాయి. ఈ ట్రైలర్ తో బనారస్ పై చాలా క్యూరీయాసిటీ పెరిగింది.

జైద్ ఖాన్ తన స్క్రీన్ ప్రజన్స్ ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ ని చాలా ఈజ్ తో చేశాడు. జైద్ ఖాన్, సోనాల్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ట్రైలర్ లో చూపించిన తొలితొలి వలపే పాట రొమాంటిక్ గా ఆకట్టుకుంది. దర్శకుడు జయతీర్థ తన స్క్రీన్ ప్లే తోమ్యాజిక్ చేశారని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపధ్య సంగీతం యాక్షన్ మరింత థ్రిల్ ని ఇచ్చింది. అద్వైత గురుమూర్తి కెమరాపనితనం రిచ్ గా వుంది. ఎన్ కె ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. పాన్ ఇండియా మూవీగా వస్తున్న బనారస్ ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జైద్ ఖాన్ మాట్లాడుతూ .. నన్ను ఆశీర్వదించడానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన రవిచంద్రన్ గారు, అర్బాజ్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. చాలా అనందంగా వుంది. ఈ ప్రయాణంలో చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను నడుడిగా పరిచయం చేస్తున్న నిర్మాత తిలకరాజ్ బల్లాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నటుడు కావాలనే నా కల ఆయన వలనే నెరవేరింది. దర్శకుడు జయతీర్థ గారికి కృతజ్ఞతలు. మంచి టీమ్ వర్క్ తో చేసిన చిత్రమిది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. ప్రేక్షకులకు వినోదం పంచుతానని మాటిస్తున్నాను. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలలో ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

రవిచంద్రన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోకి జైద్ ఖాన్ కు స్వాగతం. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకు అనుభవం వున్న నటుడిలా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు జైద్. ట్రైలర్ చాలా ఎక్సయిట్ గా వుంది. చాలా క్యూరీయాసిటీని పెంచింది. బనారస్ యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విశేష్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించి జైద్ కి గొప్ప ఆరంభం ఇవ్వాలి అని కోరారు.

అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతన్న జైద్ కి నా బెస్ట్ విశేష్. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్సయిటింగా వుంది. టైం ట్రావెల్ ఎలిమెంట్ చాలా క్యూరీయాసిటీని పెంచింది. ఈ సినిమా కోసం బనారస్ టీమ్ ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి అని కోరారు

సతీష్ వర్మ మాట్లాడుతూ.. జైద్ నాన్నగారు నాకు మంచి స్నేహితులు. ఈ సినిమాని తెలుగు విడుదల చేస్తున్నందుకు ఆనందంగా వుంది. బలమైన కంటెంట్ వున్న సినిమా ఇది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో భాగం కావడం మరింత ఆనందంగా వుంది. జైద్, బనారస్ టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x