శ్రీరూప్ క్లినిక్ ప్రారంభం కార్యక్రమంలో మిస్ ఇండియా మానస వారణాసి తో పాటు పలుగురు సినీప్రములు మరియు సినీతారలు సందడి చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 54లో శ్రిరోప్ పేరుతో అత్యాధునిక చర్మ, కేశ సంరక్షణ ఆదివారం ప్రారంభం అయ్యింది. ఈ అత్యధునిక కేంద్రాన్ని మిస్ ఇండియా వరల్డ్ 2021 మానస వారణాసి, డాక్టర్ జి. రాజశేఖర్, డాక్టర్ జి.లీల సరస్వతి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ చర్మ, కేశ సౌందర్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. అందాల రంగంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఒకప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు నగరంలోనే అత్యాధునిక సౌందర్య సేవలు అందుబాటులోకి వచ్చాయి అన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎలాంటి దుష్పరిణామాలు లేని చికిత్సలను ఇక్కడ అందిస్తున్నామని అన్నారు. లైపోసెక్షన్ తో పాటు, బ్రెజిలియన్ టెక్నిక్ తో శరీరం మొత్తం తెలుపు రంగులోకి మార్చే చికిత్స, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఐవి జెన్ FUE, ఎలాంటి కోతలు లేకుండా ఇక్కడ చికిత్స అందిస్తున్నామని అన్నారు. అలాగే వయసు తగ్గే విధానాలు, ముక్కు, పెదాల చికిత్స తదితర అన్ని చికిత్సలను అందిస్తున్నామని అన్నారు. ఇక తాము వాడే ఉత్పత్తులను స్పెయిన్, అమెరికా, థాయిలాండ్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఫ్రాన్స్, జపాన్, ఫిలిప్పీన్ నుంచి తెప్పిస్తున్నట్లు తెలిపారు.