ఎస్ యు వీ గ్రాండ్ విటారా కొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్ లోకి విడుదల చేసింది. పవన్ మోటార్స్ నెక్సా లో ఈ ఎస్ యు వి గ్రాండ్ విటారా ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి చైర్మన్ పవన్ మోటార్స్ గ్రూప్, ఉప్పల్ ఆర్ టి ఏ రవి కుమార్, కె చంద్ర పవన్ రెడ్డి ఎం డి, రీజినల్ మేనేజర్ అమిత్ కుమార్, నెక్సా మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ నెక్సా, బిజినెస్ హెడ్ రవి రెడ్డి పవన్ మోటార్స్ మరియు నెక్సా షో రూమ్ మేనేజర్ వినోద్ ఆవిష్కరణ లో పాల్గొన్నారు. గ్రాండ్ విటారా ట్రెండ్ సెట్టింగ్ వర్చువల్ అనుభూతి అందిస్తుందని, ఇప్పటికే 300 లకు కంటే ఎక్కువ బుకింగ్ లు అయ్యాయి అని పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్ రవి రెడ్డి తెలిపారు. ఈ కొత్త మారుతి సుజుకీ గ్రాండ్ విటారా ఎస్ యు వీ సెగ్మెంట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్నాయని. 1.5 లీటర్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్, 1.5 లీటరు నెక్స్ట్ జెన్ కె సర్వీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందిందని నిర్వహకులు తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… మారుతి సుజుకీ పవన్ మోటార్స్ లో గ్రాండ్ విటారా కారును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడగానే పర్యావరణం పొల్యూషన్ కావడం లక్షల బండ్లు ఒకేసారి సిగ్నల్ దగ్గర ఆగడం వల్ల ఆ కాలుష్యంతో జబ్బులు కూడా చాలా రావడం సిగ్నల్ లో ఇంజిన్ ఆపకపోవడం పెట్రోల్ కానీ డీజిల్ ఎక్కువగా కాలడం వల్ల మధ్య తరగతి వారికి ఎక్కువ భారంగా ఉంటుంది. కానీ మారుతి సుజుకి కారుల నుంచి కొత్త కొత్త టెక్నాలజీతో సిగ్నల్ లో ఆటో మ్యాటిక్ గా ఇంజిన్ ఆఫ్ అవడం తక్కువ పొల్యూషన్ రావడం అంతే కాకుండా మధ్యతరగతి వారి నుండి హై క్లాస్ వరకు అందుబాటు ధరల్లో మారుతి వారు అందిస్తున్నారు.