Thursday, November 21, 2024

Chakravyuham: ‘చక్రవ్యూహం’ రివ్యూ

అజయ్ ఎంచుకునే పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి. విలన్ పాత్ర వేసినా.. హీరోగా చేసినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా… ఆయా పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తారు. తాజాగా అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రి నిర్మించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజయ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించారు. మాస్ కమర్షియల్ సినిమాలను తీసే మైత్రి మూవీస్ వారు ఈ సినిమా ను తమ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడంతో ఈ “చక్రవ్యూహం”పై మరింత ఇంట్రెస్ట్ కలిగింది. మరి ఈ మర్డర్ మిస్టరీ ఆడియెన్స్ ను ఎలా థ్రిల్ కు గురిచేసిందో చుద్దాం పదండి.

కథ:

వివేక్ (సంజయ్), ఊర్వశి పరదేశి (సిరి). వీరిద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంట. ఎంతో అన్యోన్యంగా, హ్యాపీగా సాగుతున్న వీరి జీవితంలో ఎవరూ ఊహించని విధంగా సిరి హత్య గావించబడుతుంది. ఆ తరువాత ఆమెకు సంబంధించిన వారందరూ వరుసగా హత్యలకు గురవుతుంటారు. ఇలా ఎన్నో ట్విస్ట్ ల మధ్య ఆసక్తికరమైన పరిస్థితుల్లో ఎవరు ఎవరిని ఎందుకు చంపారో అర్థం కాకుండా ఉంటుంది. సస్పెన్స్ ప్రధానంగా సాగే ఈ కథలో సంజయ్ స్నేహితుడు సుదేశ్ (శరత్) పాత్రేమిటి? అతను ఎందుకు హత్య గావించబడ్డాడు? అలాగే సంజయ్ దగ్గర పని చేస్తున్న మేనేజర్ మరియు సంజయ్ ను ఇష్టపడ్డ ప్రగ్య నయన్ ( శిల్ప) పాత్రలేమిటి? ఈ హత్యలవెనుక ఉన్న అసలు మర్మాన్ని పోలీసులు ఎలా ఛేదించారనేదే తెలుసుకోవాలంటే ‘చక్ర వ్యూహ్యం’ సినిమా చూడాల్సిందే…

నటీనటుల నటన ఎలా వుంది…

సంజయ్ పాత్రలో నటించిన వివేక్ ఇటు భర్త గా, ఇటు సైకో గా తన హావ భావాలతో మెచ్యూర్డ్ నటన కనబరిచాడు. పాత్రలో పరకాయప్రవేశం చేసాడని చెప్పొచ్చు. ప్రతీ ఫ్రేమ్ లోనూ మెరుగైన నటనను ప్రదర్శించాడు.సంజయ్ భార్య గా నటించిన సిరి పాత్రలో ఊర్వశి పరదేశి తన పాత్రలో ఒదిగిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో సత్య గా నటించిన అజయ్ నటన ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచింది. అతడి సహ పోలీస్ పాత్రలో నటించిన దుర్గ (జ్ఞానేశ్వరి) కూడా చక్కగా నటించింది. హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ తిరందసు (రవి), కిరీటి తో పాటు, హీరోయిన్ కు తల్లిగా నటించిన ప్రియ, తండ్రులుగా నటించిన రాజీవ్ కనకాల ( శ్రీధర్ ), శ్రీకాంత్ అయ్యాంగార్ ( శ్రీనివాస్ ), హీరోయిన్ తాతగా నటించిన శుభలేఖ సుధాకర్ ( జగన్నాధం ) పాత్రలు చిన్నవే అయినా.. ఉన్నంతలో ఆయా పాత్రల పరిధిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు …

డైరెక్టర్ మధుసూధన్ కిది తొలి సినిమా అయినప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. అనుక్షణం ప్రతి సన్నివేశంలోను ఆ సస్పెన్స్ ను అలాగే కొనసాగించి దర్శకుడిగా మంచి ప్రతిభను కనపరచాడు. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. జి. వి అజయ్ కెమెరా పనితనం మెచ్చుకోవాలి. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బంధించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ పనితీరు ఓకే. భరత్ మంచిరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రి నిర్మించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్టు ఉండి సినిమాపై వారికున్న టేస్ట్ ను తెలిపింది. మొత్తంగా చూస్తే సస్పెన్స్ తో సాగే ఉత్కంఠ భరితమైన కథనాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చి దిద్దిన వైనం స్పష్టంగా కనిపించింది. సినిమా చూసే ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. చక్ర వ్యూహం… ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… గో అండ్ వాచ్ ఇట్…!!!

ట్యాగ్‌లైన్: మెప్పించే క్రైం థ్రిల్లర్
రేటింగ్: 3/5

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x