ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ విక్టరీ సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టి గెలుపు కైవసం చేసుకుంది. అనుకున్నట్లే ఎంఎస్ ధోనీ అనుభవం ముందు సంజూ శాంసన్ ఏ మాత్రం నిలవలేకపోయాడు. వాంఖడేలాంటి పిచ్‌లో 189 పరుగులు తక్కువే అయినా.. ధోనీ తన కూల్ కెప్టెన్సీతో విజయాన్న రాజస్థాన్‌కు దూరం చేశాడు. అద్భుతమైన బౌలింగ్ మార్పులతో రాజస్థాన్ బ్యాట్స్‌మన్‌కు క్రీజులో కుదురుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ధోనీ వ్యూహాలతో 10 ఓవర్లలోనే మ్యాచ్ రాజస్థాన్‌కు దూరమైంది. ఒకపక్క కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోతుండడంతో.. రాజస్థాన్ తీవ్ర ఒత్తిడికి లోనైంది.
కాగా.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంచి ఓపెనింగ్ లభించింది. రుతురాజ్ గౌక్వాడ్(10) త్వరగా అవుటైనా.. ఫాఫ్ డూ ప్లెసిస్(33) బాగా ఆడాడు. ఆ తర్వాత మొయీన్ అలీ(26), రాయుడు(27), బ్రావో(20 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయినప్పటికీ 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీశారు. మరి కాసేపట్లో 189 పరుగుల లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది.
అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఛేదనలో వెనుకబడింది. టాపార్డర్‌లో బట్లర్ (49) మినహా రాణించలేదు. బట్లర్ తర్వాత ఆ జట్టు బ్యాట్స్‌మెన్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ శాంసన్ (4) పరుగులతో మరోసారి నిరాశ పరిచాడు. ఈ జట్టులో ఉనద్కత్ (24), తెవాటియా (20) దూబే (17) మాత్రమే ఫర్వాలేదనిపించారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు.. కేవలం 143 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టు 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొయీన్ అలీ 3, జడేజా 2 వికెట్లతో సత్తా చాటారు. వీరితోపాటు శామ్ కర్రాన్ 2, ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించిన మొయీన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.