ఓ వృద్ధురాలు కరోనా సోకి మరణిచింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లన్నీ చేశారు. ఆమెను పాడెపై పడుకోబెట్టారు. ఇక నిప్పంటిస్తారనే సమయానికి ఆమె మళ్లీ లేచి కూర్చుంది. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు సహా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో, భయంతో పరుగులు పెట్టారు. మహారాష్ట్రలో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది.
పూణె జిల్లా బారామతిలోని ముదాలే గ్రామంలో ఓ వృద్ధురాలు నివశిస్తోంది. ఆమె పేరు శకుంతల గైక్వాడ్. వయసు 76 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడింది. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స తీసుకుంది. అయినప్పటికీ ఆమె కోలుకోకపోగా ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బారామతిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఆమెకు బెడ్ దొరకలేదు. దీంతో ఆమెను కారులోనే ఉంచారు. కాసేపటికి కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని రోదనలు మొదలు పెట్టారు. కొద్ది సేపటికి తేరుకుని ఆమె అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. గ్రామంలోని బంధువులకు విషయం చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు.
ఇంటికి చేరుకునే సరికి అప్పటికే ఇంటి వద్ద కొందరు బంధువులు గుమిగూడి ఉన్నారు. ఆమె మరణ వార్త విని వారంతా రోదిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసి శ్మశానానికి తరలించేందుకు వృద్ధురాలిని పాడెపై ఉంచారు. అంతే.. ఒక్కసారిగా వృద్ధురాలు ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఇది చూసి ఒక్క క్షణం భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పాడెపై నుంచి లేపి ఆసుపత్రికి తరలించారు. బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు విషయం తెలుసుకుని వెంటనే శకుంతలను చికిత్స అందిస్తు