రాజ్‌భవన్ చేరుకున్న సుప్రీం సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఆయన రాజ్‌భవన్ వెళ్లారు. రాజ్‌భవన్‌లో సీజేఐకు గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక నగరానికి ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయన రాక కోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయన 3 రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఉండనున్నారు.
అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సీజేఐ ఎన్వీ రమణ బయటకు వచ్చారు. కాసేపు తనను కలవడానికి వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. గోనుగుంట్ల కోటేశ్వర్‌రావు మాజీ దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌ను ఆప్యాయంగా పలకరించారు. రాష్ర్టానికి వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న జస్టిస్ రమణకు పూల బోకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు.
కాగా.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఆయన రాజ్‌భవన్ వెళ్లారు. రాజ్‌భవన్‌లో సీజేఐకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై ఘన స్వాగతం పలకనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక నగరానికి ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి కావడంతో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఆయన ఉండనున్నారు.