నర్సాపురం ఎంపీ ఎంపీ రఘురామకృష్ణమరాజుపై వేటు వేయించే లక్ష్యంతో వైసీపీ అన్ని మార్గాలనూ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే లోక్‌సభ స్పీకరుకు ఆ పార్టీ మరోసారి ఫిర్యాదు చేసింది. వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిశారు. వైఎస్సార్సీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల రఘురామరాజు వెంటనే చర్యలు తీసుకోవాలని, అతడి పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరారు.
అలాగే రఘురామకృష్ణమరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే లోక్ సభ స్పీకర్‌కు తాము ఆధారాలను సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్‌క్వాలిఫికేషన్‌కు సంబంధించి విజ్ఞప్తులు కూడా చేశామని భరత్ ఆయనకు వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలని భరత్ కోరారు.
‘రఘురామ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ప్రత్యేక నిబంధనలను ఉల్లంఘించారు. అందువల్ల ఆయనపై పార్లమెంట్ సాక్షిగా చర్యలు తీసుకోవాలి. ఆయను డిస్ క్వాలిఫై చేయాలి’ అని ఈ రోజు(శుక్రవారం) మరోసారి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి అందజేసినట్లు భరత్ వెల్లడించారు.