ఖైరతాబాద్ గణేష్ ఆశీస్సులతో శివ టీవీ ప్రారంభం
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఆశీస్సులతో శివ టీవీ ప్రారంభమైంది.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఆశీస్సులతో శివ టీవీ ప్రారంభమైంది. ఛానల్ బృందం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఛానల్ విజయవంతం కావాలని ఆకాంక్షించింది.
ఈ కార్యక్రమంలో విజయారెడ్డి పాల్గొన్నారు.
నిష్పక్షపాత వార్తలు, విశ్వసనీయ సమాచారం అందిస్తూ మీడియా రంగంలో శివ టీవీ ప్రత్యేక గుర్తింపు పొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఖైరతాబాద్ గణపతి ఆశీస్సులతో శివ టీవీకి ఇది కొత్త ప్రారంభమని వారు తెలిపారు.



