కంటెంట్‌కు వెళ్లండి
21, సెప్టెంబర్ 2026, సోమవారం
English
Now Showing
◆  సినీ సర్కార్‌కు స్వాగతం◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసం◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండి◆  సినీ సర్కార్‌కు స్వాగతం◆  తెలుగు సినిమా వార్తలు ఇక్కడ మీ కోసం◆  రోజువారీ అప్‌డేట్స్ కోసం అనుసరించండి

జూబ్లీహిల్స్‌లో 2,000 మంది గర్భిణులకు ఘనంగా సామూహిక సీమంతం

పోషణ వారోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది.

Cine Sarkar DeskRead in English
Share

పోషణ వారోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ నేతృత్వంలో నవ యువ నిర్మాణ్ ఫౌండేషన్, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

సుమారు 2,000 మంది గర్భిణులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గర్భిణులకు పుట్టింటి కానుకగా చీరలు, పసుపు, కుంకుమ అందజేసి సీమంతం నిర్వహించారు. గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిసి చిన్నారులకు అన్నప్రాసన జరిపి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, అజారుద్దీన్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తమకు సోదరుడిలా అండగా నిలుస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Share

వార్తలు విభాగంలో మరిన్ని