రిటైల్ ఆధారిత నాన్-డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ వెరిటాస్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కి సంబంధించి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. దీని ప్రకారం రూ. 2,800 కోట్ల పబ్లిక్ ఆఫర్‌లో భాగంగా రూ. 600 కోట్ల వరకు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో సెల్లింగ్ షేర్‌హోల్డర్లు రూ. 2,200 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ షేరు ముఖ విలువ రూ. 10గా ఉంటుంది. అర్హత కలిగిన ఉద్యోగులకు పబ్లిక్ ఇష్యూలో కొంత భాగం కేటాయించబడుతుంది. ఆఫర్ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్ వ్యాపార అవసరాలకి సంబంధించి మూలధన బేస్‌ను పటిష్టం చేసుకునేందుకు వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. బీఆర్ఎల్ఎంలతో సంప్రదింపుల మేరకు రూ. 120 కోట్ల వరకు విలువ చేసే షేర్ల ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంటును కూడా కంపెనీ చేపట్టవచ్చు.
DRHP లింకుకై ఇక్కడ క్లిక్ చేయండి
ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన నార్‌వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్ X – మారిషస్ రూ. 550 కోట్ల వరకు; కేదారా క్యాపిటల్ ఫండ్ II LLP రూ. 550 కోట్ల వరకు; బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పీఎల్‌సీ రూ. 500 కోట్ల వరకు; లోక్ క్యాపిటల్ గ్రోత్ ఫండ్ రూ. 425 కోట్ల వరకు, గ్రోత్ క్యాటలిస్ట్ పార్ట్‌నర్స్ రూ. 75 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నాయి. వ్యక్తిగత సెల్లింగ్ షేర్‌హోల్డర్ల విభాగంలో విద్యా అరుల్మణి రూ. 36 కోట్ల వరకు, పి. సురేంద్ర పాయ్ రూ. 21 కోట్ల వరకు, సవితా ఎస్ పాయ్ రూ. 21 కోట్ల వరకు, షీలా పాయ్ రూ. 14 కోట్ల వరకు, మనీషా శరద్ గాంధీ రూ. 8 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు.
2015లో ఏర్పాటైన వెరిటాస్ ఫైనాన్స్ సంస్థ, నాన్-డిపాజిట్ టేకింగ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ దీన్ని ‘ఎన్‌బీఎఫ్‌సీ-మిడిల్ లేయర్’గా గుర్తించింది. ఇది ప్రధానంగా స్వయం ఉపాధి పొందుతున్న వారితో పాటు లఘు, చిన్న మరియు మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈలు) మొదలైన వర్గాలకు చిన్న స్థాయిలో వ్యాపార రుణాలు అందిస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, జెఫ్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.