అన్నదమ్ముల మధ్య కోపతాపాలు సహజం. కానీ అవి శృతి మించితే కక్షలు, పగలుగా రూపాంతరం చెందుతాయి. సరిగ్గా ఇద్దరు అన్నదమ్ముల విషయంలో ఇలానే జరిగింది. తమ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలానికి సంబంధించి మొదలైన వివాదం ఏకంగా ప్రపంచంలోనే విచిత్రమైన బిల్డింగ్‌ను కట్టేందుకు దారి తీసింది. దాదాపు 70 ఏళ్ల క్రితం పగ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇంతకీ ఆ అన్నదమ్ములెవరనే విషయం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది.
తండ్రి నుంచి వచ్చిన స్థలంలో ఓ స్థలం ఎదురుగా సముద్రం ఉండడంతో సీ వ్యూ అంటే ఇష్టపడే వారంతా ఆ బిల్డింగ్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఆ స్థలానికి డిమాండ్ పెరిగింది. అయితే అది మరో సోదరుడికి నచ్చేలేదు. అతడిలో కక్ష పెంచింది. దాంతో ఓ విచిత్రమైన బిల్డింగ్ నిర్మించేశాడు. తనది చిన్న జాగా అయినప్పటికీ ప్రతికారం తీర్చుకోవాలన్న పంతంతో అతడు ఓ విచిత్రమైన బిల్డింగ్ రూపొందించాడు. ఆ తరువాత ఈ బిల్డింగ్ ఎంతో మంది కొనుగోలు చేశారు. అమ్మేశారు. ఇప్పుడు ఆ అన్నదమ్ములెవరన్న విషయం అంతా మర్చిపోయారు. కానీ వారి కథ మాత్రం ఇప్పటికీ అక్కడ పాపులరే.
ఈ మధ్యనే ఈ బిల్డింగ్ చూసిన ఓ ఆర్కిటెక్ట్ దీని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే దీని వెనకున్న కథగా ప్రజలు చెప్పుకుంటున్న కథను వివరించాడు. దీంతో ఈ బిల్డింగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత తక్కువ వెడల్పుతో ఉన్న బిల్డింగ్‌గా ఈ బిల్డింగ్ పేరు గడించింది. ఈ బిల్డింగ్ ఓ వైపు 14 అడుగుల వెడల్పు ఉండగా.. మరో వైపు మాత్రం కేవలం 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. 1950లో ఈ బిల్డింగ్ కట్టగా.. అప్పట్లో లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో వేశ్యా గృహంగా ఉపయోగపడిందట. ఇంతకీ ఈ బిల్డింగ్ ఎక్కడుందో తెలుసా.. లెబనాన్ రాజధాని బీరుట్‌లో.