Sunday, March 22, 2026

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వస్తోంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ మూవీ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. బుధవారం ఉదయం ఓ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అంటూ చిత్రయూనిట్ హడావుడి చేసిన విషయం తెలిసిందే. చెప్పినట్లే ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. దిల్ రాజు – శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల (మార్చి) 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. లాయర్ గెటప్ లో పవర్ ఫుల్‌ లుక్ పవన్ కళ్యాణ్ పోస్టర్ అదిరిపోతుంది.

ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ సినిమా బజ్‌ను పెంచేశాయి. ట్రైలర్‌కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై భారీగా హైప్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్; ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -