Thursday, November 21, 2024

‘మనంసైతం’: దిల్ రాజు చేతుల మీదుగా అవసరార్ధులకు చెక్కుల పంపిణి

పేద‌వారికి సాయ ప‌డాల‌న్న సంక‌ల్పం.. నిస్సాహ‌య‌కుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌న్న మాన‌వ‌త్వం.. మొత్తంగా స‌మాజంలో అంద‌రూ బాగుండాల‌నే ల‌క్ష్యం.. వీట‌న్నింటికి ప్ర‌తిరూపమే.. ‘మనం సైతం’. గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎంతో మందికి సాయం చేస్తోంది కాదంబరి కిరణ్ నిర్వ‌హ‌ణ‌లోని ‘మనం సైతం’ ఫౌండేష‌న్. ఈ సంద‌ర్భంగా కాదంబరి కిరణ్ ఫౌండేషన్ సారధ్యంలో ఆరుగురికి నిర్మాత దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు పంపిణి చేశారు. త‌మ సాయం నిరంత‌రంగా కొన‌సాగుతూనే వుంటుంద‌ని తెలిపారు.

ఫిల్మ్ చాంబర్ వేదికగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ… ‘మనం సైతం’ ఫౌండేషన్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి నేటి వరకు అండగా ఉంటున్న కళామాతల్లి ముద్దుబిడ్డలైన ప్రతిఒక్కరికి పాదాభివందనం. గ‌డిచిన‌ పది సంవత్సరాల కాలంలో పేదలైన సినీ కార్మికులకు కోటి రూపాయాలకు పైగా సహాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఙతలు తెలిపారు. గడిచిన పది సంవత్సరాల కాలం నుంచి తెలుగు రాష్ట్రాలలో ఉన్న పేదల నుంచి విజ్ఞ‌ప్తులు అందుతుండటంతో సాధ్య‌మైనంత సహాయం చేస్తున్నాం, అంతేకాకుండా ప్రకృతి వైపరిత్యాలైన తిత్లీ తూఫాన్, కర్నూలు వరదలు, కేరళ వరదల సమయంలో అందరి సహాకారంతో సహాయం చేశాము. వందలాది మంది సాయం కోసం ఎదురుచూపు కానీ ‘మనం సైతం’ సేవలు తీసుకునే వారికి తొందరగా చేరుకున్నా.. దాత‌ల ద‌గ్గ‌రికి అంత తొందరగా చేరడం లేదని నా భావన.. ఇది తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు ప్రసన్న కుమార్ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, దాము గారు, వివి వినాయక్ గారు, జయసుధ గారు తమ సహాకారం ఉంటుందని ప్రోత్సాహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దిల్ రాజు, దాము, ప్రసన్న కుమార్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అవసరార్ధులకు రూ. 25 వేలు చొప్పన చెక్కుల పంపిణి అందజేయడం ఆనందగా ఉంది అని అన్నారు.

ముఖ్య అతిథి దిల్ రాజు మాట్లాడుతూ.. దేవుడు ఉన్నాడా..? లేడా.? చర్చ రెగ్యూలర్ గా వింటూ ఉంటాం అది మనుషులకైతే తెలియదు. నమ్మేవాళ్లు నమ్ముతారు. నమ్మని వాళ్లు నమ్మరు. దేవుడు మనిషి పుట్టించాడు. ఆ మనిషి ద్వారా ఎదుటి మనిషికి సాయం పొందినప్పుడే దేవుడున్నాడని నమ్ముతుంటారు. ‘మనం సైతం’ సేవా కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి, మనిషికి కాదంబరి కిరణ్ ఓ వారధి, ఇలాంటివి చూసినప్పుడు దేవుడు ఉన్నాడని బలంగా అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో పెద్దలు, స్నేహితుల సహాకారంతో ఇప్పటివరకు చాలా సేవలు చేశారు. మీ చివరి శ్వాస వరకు ఈ సేవలు కొనసాగించండి. మీ వెనుక మేము ఉంటాం. దైవం మానవ రూపంలో అవతరించు నీలోకంలో. అదే కాదంబరి కిరణ్ అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సాయం చెయ్యాలని ఉంటుంది. దానికి వెనుక మరో లక్ష్యం ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా అని పదేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చిన కాదంబరి కిరణ్ అడిగాను. అలాంటిది ఏం లేదు అన్నాడు. తొమ్మిదేళ్లుగా గమనిస్తున్నాను. అ రోజు ఏదైతే చెప్పాడో అదే లక్ష్యం తో పనిచేస్తున్నారు. సహాయం చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. వారి దగ్గరికి వెళ్లి డబ్బు తెచ్చి.. అవసరార్ధులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇది అంత సులువు కాదు. కాదంబరి పౌండేషన్ ద్వారా ఓ ఓల్డేజ్ హోం కట్టాలని అనుకుంటున్నారు. అది నెరవేరాలని ఆయనకు మా సహాకారం ఎప్పుడు ఉంటుంది అన్నారు.

నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్నారు నందమూరి తారకరామారావు. ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్నా అన్నారు మదర్‌ ధెరిస్సా. అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కాదంబరి కిరణ్ గారు. కరోనా సమయంలో వేలమందికి సాయం చేశాడు. ఆయన సేవలను గుర్తించి చాలా మంది సినీ పెద్దలు కాదంబరికి అండగా నిలిచారు. వృద్దాశ్రమం కట్టాలనే కొరిక నెరవేరాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. కరోనా సమయంలో వివి వినాయక్ గారు తనవంతు బాధ్యతగా సాయం చెయ్యాలనుకున్నప్పుడు.. కాదంబరి కిరణ్ అయితేనే నిజాయితీగా చెయ్యగలడని భావించి 5 లక్షలు చెక్కు ఇచ్చారు. అది ఆయన అంతే బాధ్యతతో అవసరార్ధులకు అందజేశారు. కాదంబరి కిరణ్ సేవ కార్యక్రమాలు మరింత మందికి చేరాలని కోరుకుంటున్నాను అని అన్నారు..

వీరితో పాటు దర్శకులు చంద్ర మహేష్, ప్రేమ్ రాజ్, మహనంద్ రెడ్డి, సాంబశివరావు, బందర్ బాబీ, మనం సైతం సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గోన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x