విజనరీ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారి చేతుల మీదుగా ‘ఆకాశ వీధుల్లో’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. జీ.కే. ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో మనోజ్ జే.డి. మరియు డి.జే. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. ఈ చిత్రంతో దర్శకుడిగా గౌతమ్ కృష్ణ పరిచయం అవుతున్నారు. ఫస్ట్ విడుదల అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. చిత్రం యొక్క టీజర్ మరియు రెండు పాటలు చూశాను నాకు బాగా నచ్చాయి. టీమ్ అందరికీ అభినందనలు.. అని తెలిపారు. చిత్ర కథానాయిక పూజిత పొన్నాడ మాట్లాడుతూ.. క్రిష్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.. అన్నారు.
నూతన నటుడు మరియు దర్శకుడిగా పరిచయం అవుతున్న గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా నా రెండున్నర ఏళ్ల కృషి, ఈ మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మా మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసినందుకు క్రిష్ గారికి కృతజ్ఞతలు.. అన్నారు. ఈ చిత్రాన్ని జీ.కే. ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లు మనోజ్ జే.డి. మరియు డి.జే. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నటీనటులు :
గౌతమ్ కృష్ణ
పూజిత పొన్నాడ
రచన & దర్శకత్వం: గౌతమ్ కృష్ణ
బ్యానర్లు: జీ కే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియషన్స్
ప్రొడ్యూసర్స్: మనోజ్ జే.డీ అండ్ డా. డీ.జె. మణికంఠ
సంగీతం: జుడా శాండీ
డి.ఓ.పీ: విశ్వనాథ్ రెడ్డి
పీఆర్‌ఓ: వంశీ శేఖర్