ఖైదీ, దొంగ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత కార్తి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తి ఇంటర్వ్యూ..
ఈ కథలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన అంశాలేంటి?
– మాములుగా ఇంట్లో ఒక్క అన్నయ్య ఉంటేనే గొడవలు వస్తాయి. అలాంటిది వందమంది అన్నయ్యలు ఉంటే ఏం జరుగుతుంది? అనే పాయింట్ నన్ను బాగా ఎగ్జయిట్ చేసింది. అదే ఈ సినిమా కథాశం కూడా. దర్శకుడు బక్కియరాజ్ కి ఇది రెండో చిత్రం. నన్ను కలిసి 20నిమిషాలు ఈ ఐడియా గురించి చెప్పారు. రోబోటిక్ ఇంజినీర్ అవ్వాలనుకునే ఒక కొడుకు వారి నాన్నఒక ఆరు నెలలు 100మంది రౌడిలు ఏం చేయకుండా చూసుకోవాల్సి వస్తే అతడి పరిస్థితి ఏంటి? ఆ వంద మంది రౌడిలను ఎలా కంట్రోల్ చేశాడు అన్న స్టోరీలైన్ చెప్పాడు. ఆ తర్వాత నిర్మాతలు నాకు ఫోన్ చేసి ఈ స్టోరీ చాలా బాగుంది కాకుంటే దీన్ని పెద్ద రేంజ్‌లో తీస్తేనే బాగుంటుంది అని చెప్పి దాదాపు రెండు సంవత్సరాలు ఈ కథని డెవలప్ చేశారు. మీరు చినబాబు సినిమాలో చూస్తే ఇంట్లో నలుగురు అక్కలు, ఒక్కొక్కరు ఒక్కోరకం. వారిని హ్యాండిల్ చేయడమే కష్టం అంటే ఈ సినిమాలో 100మంది అన్నలు వారిని ఎలా కంట్రోల్ చేశాడు. ఈ సినిమాలో డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌కి మంచి స్కోప్ ఉంది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక కుటుంబంలోని అందరూ ఎంజాయ్ చేసే చిత్రం ఆ ధైర్యంతోనే ఈ సినిమాని థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ రోజు నేను ఎలా ఎగ్జయిటెడ్‌గా ఫీలయ్యానో లాస్ట్‌డే కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్ ఉంది. ఒక సినిమాకి అది చాలా ముఖ్యం.
ఓటిటి నుండి ఏమైనా ఆఫర్లు వచ్చాయా?
– చాలా ఆఫర్లు వచ్చాయి కాని.. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే చేశాం. కాబట్టే ఏప్రిల్ 2న థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తున్నాం.
రోజూ వందమందితో పనిచేయడం ఎలా అనిపించింది?
– ఇదే విషయాన్ని మా ఫ్రెండ్ ఒకరు అడిగారు. ఈ కోవిడ్‌టైమ్‌లో డైలీ భార్యభర్తలు మాత్రమే ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నాం. అలాంటిది థియేటర్‌లలో ప్రతీ ఫ్రేమ్‌లో 100మందికి పైగా ఉంటే ఎలా ఉంటుంది అని.. దానికి అదే ఫెస్టివల్‌రా అదే మనకి కావాలి అని చెప్పాను. ఈ సినిమాలో నా వెనక ఉండే 100మంది యాక్టర్స్. ఒక హ్యూజ్ ఎమోషన్ ఉంటుంది. లవ్ సీన్‌లలో కూడా వారు వచ్చి వెనక నిలబడేవారు. అరే ఇది లవ్‌సీన్‌రా వెళ్లండి అని చెప్పేవాళ్లం. ఫస్ట్ రెండు మూడు రోజులు ఎవరికి క్లోజ్ పెట్టాలి అని కన్‌ఫ్యూజన్ ఉండేది ఆ తర్వాత అందరం సెట్ అయ్యాం. మా టీమ్ అందరికీ ఒక కొ్త్త ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా..సెట్లో ప్రతిరోజూ ఒక పండగలా ఉండేది.
సుల్తాన్ అని టైటిల్ పెట్టడానికి రీజనేంటి?
– ఈ సినిమాలో మళయాలం యాక్టర్ లాల్ గారు నా గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ చేశారు. వాళ్లు ఈ సినిమాలో ముస్లీమ్స్. చిన్నప్పటినుండి వాళ్లే పెంచుతారు. అతను నన్నుముద్దుగా సుల్తాన్ అని పిలుస్తాడు. అందుకే ఆ టైటిల్ పెట్టడం జరిగింది.
ఇంతకు ముందు సుల్తాన్ అంటే గూగుల్‌లో సల్మాన్ ఖాన్ అని చూపిస్తుంది కదా?
– అది ఈ సినిమాతో ఎట్‌లీస్ట్ సౌత్‌లోనైనా మారుతుంది అనుకుంటున్నాను(నవ్వుతూ)
బక్కియరాజ్ కణ్ణన్ ఒకే సినిమాకి దర్శకుడు కదా! సెట్లో ప్రాపర్ ఐడియా ఎగ్జిక్యూట్ చేయడం అతనికి ఇబ్బందిగా అనిపించలేదా?
– అందుకే ఈ సినిమాలో వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఉంది. కెమెరా మెన్ సత్యన్ సూర్యన్ ఖాకీ, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలు చేశారు. ఎడిటర్ రూబెన్ కూడా అన్ని పెద్దసినిమాలకే వర్క్ చేస్తాడు ఇలా వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్తో పాటు ఇంతకు ముందు సినిమాలు చేసిన దర్శకులని కో డైరెక్టర్స్‌గా పెట్టుకోవడం జరిగింది. అందుకే ఈ సినిమా చేయగలిగాం.. వాళ్లందరినీ ఒక్కచోటకు తీసుకురావడమే గంట సేపు పట్టేది. అలాగే ఒక చిన్న సీన్ తీయాలన్నా పెద్ద ప్రదేశం కావాల్సి వచ్చేది. ఈ వందమంది ఉండడానికి ఇళ్లు కూడా సెట్ వేయాల్సి వచ్చింది.
ఈ 100మందిలో ఎంతమందికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది?
– ఎట్‌లీస్ట్ ఒక 6-7 క్యారెక్టర్స్‌కి చాలా ప్రాధాన్యత ఉంది.
ఖైదీ తర్వాత మీ థాట్ ప్రాసెస్‌లో ఎమైనా మార్పు వచ్చిందా?
– లేదండి! ఆ సినిమాలో పాటలు అవసరం లేదు..కంటెంట్ మీద వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తే మణిరత్నం గారితో పొన్నియణ్ సెల్వన్ సినిమా చేస్తున్నాను. అది ఒక ఎపిక్ మూవీ. ఇలా ప్రతీ సినిమా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నాను. అందుకే తక్కువ సినిమాలు చేశాను (నవ్వుతూ). నేను నా ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. తర్వాత అభిమన్యుడు డైరెక్టర్ మిత్రన్‌తో ఒక సినిమా చేస్తున్నాను. అది ఒక ఛాలెంజింగ్ మూవీ..
మీ సినిమాని నాగార్జున గారు విష్ చేశారు కదా..?
– ముందుగా నాగార్జున గారికి ధన్యవాదాలు. ఆ సినిమా ఈవెంట్‌లో కూడా మా సినిమాని విష్ చేశారు. నేను ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా తప్పకుండా ఇద్దరికి ఫోన్ చేస్తాను. ఒకటి నాగార్జునగారు,రెండోది డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వాళ్లు నా ఫ్యామిలీమెంబర్స్ లాంటి వారు. ఊపిరి సినిమా కూడా కథ బాగా నచ్చింది దాంతో పాటు మధ్యలో నాగార్జునగారికి కలవొచ్చు కదా అనే ఒప్పుకున్నాను. నాగార్జున గారు మనస్పూర్తిగా నాకు విష్ చేశారు..వారికి ఇక్కడ నుండి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు..ఆయనని కలిసి థ్యాంక్స్ చెప్తాను. ఒక బిగ్‌ఫిల్మ్‌తో మా సినిమా వస్తోంది. ఇక్కడ మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి రెండు సినిమాలు ఆడాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను.
రష్మికతో ఫస్ట్ ఫిలిం కదా! ఆమెతో వర్క్ ఎక్స్‌పీరియన్స్?
- తను ఈ సినిమాలో విలేజ్ అమ్మాయి క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. తను ఇంతకు ముందు అలాంటి పాత్రలు చేసింది అనుకున్నాను. కాని తనకి ఇది ఫస్ట్ టైమ్. పల్లెటూరు అంటే ఏం తెలీదు. ఈ సినిమాలో ట్రాక్టర్ నడపడం, పాలు పితకడం వంటి పనులన్ని చేసింది. సగం మూవీ పూర్తయ్యాక విలేజ్ లైఫ్ ఇంత టఫ్‌గా ఉంటుందా? అని అడిగేది. తను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసింది. సినిమా బాగా వచ్చింది కాబట్టి రిలాక్స్‌డ్‌గా ఉన్నాను. హాలీడేస్ కూడా ఉన్నాయి ఇది కరెక్ట్ టైమ్ అనుకుంటున్నాను.
లాక్‌డౌన్ తర్వాత తెలుగు, తమిళ పరిశ్రమలో మీరు గమనించిన మార్పులేంటి?
– ఇక్కడ సినిమాలు బాగా ఆడుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ వల్లే అందరికీ ఒక హోప్ వచ్చింది. నా సినిమా వస్తుంది అన్నప్పుడు కూడా ఇక్కడ మంచి సినిమా వస్తే బాగా ఆడుతుంది అనే నమ్మకం ఉంది.
లాక్‌డౌన్ తర్వాత మీ కథల ఎంపికలో ఎమైనా చేంజెస్ వచ్చాయా?
– లేదండీ.. డెఫినెట్‌గా నెక్స్ట్ ఇయర్ కోవిడ్ మీద 100 సినిమాలు వస్తాయి. కోవిడ్ టైమ్‌లో జరిగినవి, కోవిడ్ మీద జోక్స్ అందరూ డైరెక్టర్స్ రాస్తారు కాబట్టి అలాంటి కథలు నేను చేయను.
సిరుత్తై తర్వాత అంత భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని డైరెక్టర్ చెప్పాడు కదా…?
– ఇదే విషయం మా చెల్లి కూడా చెప్పింది. లేడిస్ కి కూడా సినిమా బాగా నచ్చింది… అందరూ అంటున్నట్టు అలా అయితే చాలా హ్యాపీ..
పొన్నియన్ సెల్వన్ అప్‌డైట్ ఏంటి?
– పొన్నియన్ సెల్వన్ షూటింగ్ 70% పూర్తయ్యింది. అది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఆ సినిమా గురించి మాట్లాడడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ఆ సినిమా సమయంలో చెప్తాను. అది 1950లోని ఫైవ్ వాల్యూమ్ నావెల్. దాన్ని కాంప్రెస్ చేసి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం.
మంచి స్క్రిప్ట్ వస్తే నేను, అన్నయ్య కలిసి నటించడానికి సిద్దమే..
లాక్‌డౌన్ సమయంలోనే బాబు పుట్టాడు. నాకు ట్రెడిషనల్ నేమ్స్ అంటేనే ఇష్టం కాబట్టి కందన్ అని పేరు పెట్టాను అంటే మురుగన్.. కార్తికేయ స్వామి అని అర్ధం. మా ఫ్యామిలీలో మా అందరికీ ఆయన పేరే ఉంటుంది.