Thursday, November 21, 2024

రవితేజ ‘ఖిలాడి‌’ టీజర్‌ అదిరింది

`క్రాక్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ, ‘రాక్ష‌సుడు’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఖిలాడి`. మాస్ మ‌హారాజా అభిమానుల‌కు ఉగాది కానుక‌గా వారు ఎంత‌గానో ఎదురుచూస్తున్న` ఖిలాడి` టీజ‌ర్‌ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్. యాక్ష‌న్ ప్యాక్డ్ కమ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ అల‌రించ‌నుంద‌ని టీజ‌ర్ చూస్తుంటే తెలుస్తోంది. యాక్ష‌న్‌, హైఇంటెన్స్ ఎమోష‌న్స్‌తో పాటు రొమాన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది.

డింపుల్ హయాతితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు క‌నిపించిన ర‌వితేజ ఒక్క‌సారిగా ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించ‌డంతో… అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన ప‌రిణామాలేంటో తెలుసుకోవాలిన్న ఆస‌క్తిని క్రియేట్ చేశారు మేకర్స్‌. ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ ఒకే ఒక్క డైలాగ్‌తో జస్ట్ విజువల్స్ మరియు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో టీజ‌ర్ చాలా థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీనాక్షి చౌధ‌రి, అర్జున్‌, థాకూర్ అనూప్ సింగ్‌, ముర‌ళి శ‌ర్మ‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు టీజ‌ర్‌లో ‌ క‌నిపించారు.

`ఇఫ్ యూ ప్లే స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోష‌న్స్‌..యూ ఆర్ అన్‌స్టాప‌బుల్` అంటూ ర‌వితేజ్ చెప్పే ఒకే ఒక్క డైలాగ్ ఈ టీజ‌ర్‌కి హైలైట్ అయ్యింది. మొత్తానికి ఈ టీజర్ ఖిలాడి చిత్రంపై అంచనాల‌ను భారీగా పెంచింది. సుజిత్ వాసుదేవ్‌, జి కె విష్ణు సినిమాటోగ్రఫీ మ‌రియు దేవిశ్రీ‌ప్ర‌సాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజ‌ర్‌కి మేజ‌ర్ అసెట్స్. రవితేజ ఇంటెన్స్ పెర్‌ఫామెన్స్‌, భారీ బడ్జెట్‌తో రూపొందినందున ప్ర‌తీ ఫ్రేమ్ లావీష్‌గా క‌నిపిస్తోంది. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దుతున్నారు ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ. ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా భారీ బ‌డ్జెట్‌తో గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు నిర్మా‌త కోనేరు స‌త్య‌నారాయ‌ణ. ‌రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రానికి సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు మాస్ట‌ర్స్ యాక్ష‌న్‌కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌డం విశేషం.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి, అర్జున్‌, థాకూర్ అనూప్ సింగ్‌, ముర‌ళి శ‌ర్మ‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ వ‌ర్మ‌
నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ కోనేరు
బ్యాన‌ర్లు: ఏ స్టూడియోస్‌, పెన్ స్టూడియోస్‌
ప్రొడ‌క్ష‌న్‌: హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌
స‌మ‌ర్ప‌ణ‌: డాక్ట‌ర్ జ‌యంతీలాల్ గ‌డ‌
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు(క్రాక్ ఫేమ్‌)‌
స్క్రిప్ట్ కో ఆర్డినేష‌న్‌: పా‌త్రికేయ
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు
డైలాగ్స్‌: శ్రీ‌కాంత్ విస్సా, సాగ‌ర్‌
ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి
లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
పాట‌లు: శ్రీ‌మ‌ణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ముర‌ళీకృష్ణ కొడాలి
ప్రొడ‌క్ష‌న్ హెడ్‌: పూర్ణ కండ్రు.
కో- డైరెక్ట‌ర్: ప‌వ‌న్ కేఆర్‌కె
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x