Wednesday, January 22, 2025

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ‘ఇష్క్‌’ ఇంటర్వ్యూ

`ఓరు ఆధార్ లవ్` అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్… ఒకే ఒక్క కన్ను గీటుతో ‘వింక్‌గాళ్‌’గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో క‌లిసి ‘ఇష్క్‌’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత తెలుగులో నిర్మిస్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మీడియాతో ముచ్చ‌టించింది. ఆ విశేషాలు..

– నితిన్‌గారి ‘చెక్‌’ మూవీ తర్వాత నేను చేసిన సెకండ్‌ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘ఇష్క్‌’. నాట్‌ ఏ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఒక కొత్త సబ్జెక్ట్ తో రూపొందిన సినిమా ఇది. టీమ్‌ అందరం కలిసి ఓ మంచి ప్రయత్నం చేశాం. ఈ కథకు త‌ప్ప‌కుండా ప్ర‌తి ఆడియన్‌ రిలేట్‌ అవుతారు. సినిమాలో ప్రతి సీన్‌ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్‌ సీన్‌లో ఏం జరుగుతుందా? అనే ఎగ్జైట్ మెంట్ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్ష‌కుల ‌మైండ్‌లో కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా చూసి ఆడియ‌న్స్ తప్పకుండా థ్రిల్ ఫీల‌వుతారు.

– ఈ చిత్రంలో నేను అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. త‌ను సెల్ఫ్ రెస్పెక్ట్‌ ఉన్న కాలేజ్‌ గాళ్‌. త‌న క్యారెక్ట‌ర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘చెక్‌’ సినిమాలో నా స్క్రీన్‌ ప్రజెన్స్‌ టైమ్‌ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఫుల్‌ లెంగ్త్‌ ఉంటుంది.

– తేజ సజ్జా మంచి కో స్టార్‌. ఇంకా చెప్పాలంటే నా ఏజ్‌గ్రూప్‌తో సరిపోయే యాక్టర్‌. సో..సెట్స్‌లో చాలా ఫన్‌ ఉండేది. తెలుగు డైలాగ్స్‌ చెప్పడంలో నేను కాస్త ఇబ్బందిపడ్డప్పుడు తేజ నాకు బాగా హెల్ప్‌ చేశాడు.

– దర్శకుడిగా ఎస్‌ఎస్‌ రాజుగారికి ఈ ‌సినిమా తొలి ప్రాజెక్ట్‌. అయినా చాలా కాన్‌సన్‌ట్రేటెడ్‌గా చేశారు. సెట్‌లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. క్యారెక్టర్‌ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ చేయమని చెప్పి దర్శకుడు నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఈ సినిమా కోసం మేజర్‌గా నైట్‌ షూట్స్‌ చేయాల్సి వచ్చింది.

– కొంతగ్యాప్‌ తర్వాత మెగాసూపర్‌గుడ్‌ ఫిలింస్‌ చేసిన తెలుగు సినిమా ఇది‌. ఈ ఆఫ‌ర్ నాకు సడన్‌గా వ‌చ్చింది. ‌పెద్దగా ప్లాన్‌ కూడా చేసుకోలేదు. మెగాసూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ వంటి మంచి బ్యానర్‌లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్‌ అవుతుందని వెంటనే `ఇష్క్`‌ సెట్స్‌లో జాయినైపోయాను.

– ఇష్క్‌ ఓ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌. ఆ సినిమా బేస్‌‌ లైన్‌ నాకు బాగా నచ్చింది. కథ బాగా కుదరిందని అనిపించింది. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేశారు.

– తెలుగులో డైలాగ్స్‌ పలకడం నేర్చుకుంటున్నాను. ఇష్క్‌ సినిమా చేసేప్పుడు టీమ్‌ నాకు హెల్ప్‌ చేశారు. ముందురోజే డైలాగ్స్‌ తీసుకుని నేను ప్రాక్టీస్‌ చేసి సెట్స్‌కు వచ్చేదాన్ని. అదీ నాకు కొంత హెల్ప్‌ అయ్యింది.

– మలయాళంలో నేను నటించిన తొలి సినిమా ‘ఓరు ఆధార్‌ లవ్‌’ తెలుగులో ‘లవర్స్‌ డే’గా విడుదలై రెండేళ్లు అవుతుంది. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ ఏడాది నా రెండు సినిమాలతో (ఇష్క్, చెక్‌) తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా లేకపోతే చెక్‌ సినిమా గత ఏడాదే విడుద‌ల‌య్యేది. ఇష్క్‌ ఈ ఏడాది వచ్చేది. ఇలా ఏడాదికో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

– మనం నటించిన అన్ని సినిమాలు ఆడవు. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తుంది. కానీ ఫెయిల్యూర్స్‌ నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్‌ అన్ని నాకు డిఫరెంట్‌గానే అనిపించాయి. ఇష్క్‌లో నేను చేసిన అనసూయ పాత్ర మోర్‌ ఇంటెన్స్‌ అండ్‌ డ్రమటిక్‌గా ఉంటుంది.

– సందీప్‌కిషన్ ‌గారి నెక్ట్స్‌ మూవీలో నేను ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఆ మూవీ షూటింగ్‌ ఆల్రెడీ స్టార్ట్‌ అయ్యింది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్క‌ర్ష‌న్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాను.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x