ఢిల్లీ కేపిటల్స్ బౌలింగ్ మరింత బలం పుంజుకోనుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నార్ట్‌జే జట్టుతో చేరనున్నాడు. బయో బబుల్ సెక్యూర్‌ను బ్రేక్ చేయడం వల్ల జట్టుకు దూరమైన నోర్ట్‌జే తిరిగి జట్టుతో కలవనున్నాడు. తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండబోతున్నాడు. ఢిల్లీ కేపిటల్స్ తన తదుపరి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడబోతోంది. ఈ క్రమంలోనే స్టార్ బౌలర్ జట్టుతో చేరడం ఢిల్లీకి కలిసిరానుంది. ఇప్పటికే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో రాజస్థాన్ అదరగొట్టింది. ఈ క్రమంలోనే మరో పేసర్ జట్టుతో చేరడంతో ఆ జట్టు బౌలింగ్ దళం మరింత బలోపేతమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎలాగైనా గెలివాలని ఢిల్లీ భావిస్తోంది.
నోర్ట్‌జే బయో బబుల్ నిబంధనలు బ్రేక్ చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఎవరైనా బయోబబుల్ నిబంధనలను బ్రేక్ చేస్తే.. ఆ క్రికెటర్ మళ్లీ జట్టుతో చేరేముందు 3 కరోనా నిర్ధారణ టెస్టుల్లో వరుసగా మూడుసార్లు నెగెటివ్ రావాలి. అలా నెగెటివ్ వచ్చిన సర్టిఫికెట్లను మేనేజ్‌మెంట్‌కు అందజేయాల్సి ఉంటుంది. అలాగే 14 రోజుల క్వారంటైన్ కాలాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. అన్రిచ్ నార్ట్‌జే తనకు సంబంధించిన కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్లను జట్టు యాజమాన్యానికి అందజేశాడు. నార్ట్‌జే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని మేనేజ్‌మెంట్ తెలిపింది. క్వారంటైన్ పీరియడ్‌ను ముగించుకున్న నార్ట్‌జే జట్టుతో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో ఢిల్లీ కేపిటల్స్ టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగింది. గత సీజన్లో ఫైనల్లో ముంబై చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఢిల్లీ ఈ సారి ఎలాగైనా ట్రోఫీ పట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే అనూహ్యంగా రెండో మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఢిల్లీ.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలైంది. 147 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.