ఏ జట్టులోకైనా స్టార్ ఆటగాళ్లు, కీలక ఆటగాళ్లు వస్తే ఆ జట్టు బలం రెట్టింపవుతుంది. ప్రస్తుతం ఆసీస్ జట్టు అలాంటి బలాన్నే పొందబోతోంది. ఎందుకంటే ఆ జట్టులోకి జాతీయ స్టార్ ఆటగాళ్లంతా రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. తాజాగా విండీస్‌తో జరగబోతున్న సిరీస్ కోసం ఆసీస్ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా తిరిగి జట్టులోకి రాబోతున్నారు. జులై 10 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 23 మంది సభ్యులతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్(సీఏ) సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇటీవలి టోర్నీల్లో ఆసీస్ జట్టులో లేని ఆటగాళ్లంతా తిరిగి ఎంపికయ్యారు.
ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో ఆసీస్ జట్టులో కీలక ఆటగాళ్లు పెద్దగా లేరు. అయితే ఈ సారి విండీస్ జట్టుతో జరుగబోతున్న స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి రాబోతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ పర్యటన కోసం ఆసీస్ సెలెక్షన్ కమిటీ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ టీం.. విండీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు ఆడబోతోంది.
అయితే మరికొన్ని నెలల్లో జరగబోతున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకునే ఆసీస్ ఈ విధమైన జంబో జట్టును ప్రకటించింది. అంతేకాకుండా స్పిన్నర్లను అత్యధికంగా ఎంపిక చేయడం కూడా అందులో భాగంగానే అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఐసీసీ పేర్కొన్న విషయంలో టీ20 ప్రపంచకప్ ఇండియాలో జరగబోతోంది. ఈ క్రమంలోనే అంతమంది స్పిన్నర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆస్టన్ అగర్, జేసన్ బెహ్రెరెన్డార్ఫ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మోసిస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్‌సన్, జై రిచర్డ్‌సన్, తన్వీర్ సంఘా, డి షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, అండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.